Asianet News TeluguAsianet News Telugu

వివాహితపై భర్త, అత్తామామల దాడి.. పిల్లల ఎదుటే గొంతునులిమి హత్య..

శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా వేరుగా ఉంటున్న భార్యను భర్త, అత్తామామలు కలిసి దారుణంగా హతమార్చారు. 

Married woman attacked by husband and in-laws, Killed in Srikakulam
Author
Hyderabad, First Published Jul 2, 2022, 8:41 AM IST

శ్రీకాకుళం : ఎన్నోకలలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన కోడలిని భర్త, ఆమె అత్తా మామలు అతి దారుణంగా మూకుమ్మడిగా దాడి చేసి, హత్య చేశారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలంలో  జరిగింది. ఆమె పాలిట కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. అతి కిరాతకంగా ఆ అమాయకురాలు ప్రాణాలు తీసేసాడు. కొడుకు చేస్తున్న దారుణాన్ని అడ్డుకోవాల్సిన అత్తామామలు ఇందుకు తోడయ్యారు. ఇంకా దారుణమైన ఘటన ఏంటంటే కన్నపిల్లలు ఎదుటే ఈ ఘటన జరగడం. తల్లి చనిపోవడం చూస్తూ కూడా ఏడవడం తప్ప వారు ఏమీ చేయలేకపోయారు.

శుక్రవారం సాయంత్రం కంచిలి మండలం పద్మతుల గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంపురం పంచాయతీ పద్మతుల గ్రామానికి చెందిన పిట్టా శ్రీనుకు..  పదకొండేళ్ల కిందట పుష్ప(30)తో వివాహం అయ్యింది. వీరికి  ఇద్దరు ఆడపిల్లలు. ఒక బాబు ఉన్నారు. పిట్ట శ్రీను ఆర్మీలో విధులు  నిర్వహిస్తున్నాడు. అయితే అతనికి ఈ మధ్యకాలంలో భార్య వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుంది అని అనుమానం వచ్చింది. ఈ అనుమానంతోనే నిరుడు ఆమె మీద దాడి చేశాడు. దీంతో కేసు కంచిలి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఈ కేసు ప్రస్తుతం పెండింగ్లో ఉంది.

ఆ తర్వాత కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలిద్దరూ అదే గ్రామంలో..  వేరువేరు ఇళ్లల్లో ఉంటున్నారు. ఇటీవల శ్రీను సెలవుల మీద గ్రామానికి వచ్చాడు. ఇదే సమయంలో పుష్ప వేరే ఊరికి వెళ్ళింది.  తన కన్నవారి ఊరు ఇచ్చాపురంలో గ్రామ దేవతల సంబరాల కోసం.. పిల్లలను తీసుకుని పిన్ని ఇంటికి వెళ్ళింది. వారం రోజుల తర్వాత  తిరిగి శుక్రవారం పద్మతులకు వచ్చింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి..  భర్త ఆమె ఉంటున్న ఇంటి తాళాలు పగలగొట్టాడు. వేరే తాళాలు వేసుకుని తల్లిదండ్రులు నూకయ్య, సాయమ్మ వద్దకు వెళ్ళాడు. 

‘ఈసారి.. వైఎస్ కుటుంబంలో ఎవరు ఎవరిని చంపుతారోనని అనుమానం కలుగుతోంది’...ఆనం వెంకట రమణారెడ్డి

ఇంటికి తిరిగివచ్చిన పుష్ప ఇంటి తాళం పగులగొట్టి ఉండడం, వేరే తాళం వేసి ఉండటం గమనించింది. ఇదంతా భర్త పనే అని అనుమానించింది. ఆ తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లింది. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంది. సాయంత్రం పిల్లల్ని ఇంటికి తీసుకు వద్దామని భర్త ఇంటికి వెళ్ళింది. ఈ క్రమంలో మామ నూకయ్య దురుసుగా ప్రవర్తించాడు. ‘నీకు పిల్లలు కావాలా’ అంటూ ఆమె మీద దాడికి దిగాడు. అతనికి అత్త కూడా తోడైంది. అత్త సాయమ్మ, మామ నూకయ్య కలిసి పుష్పను రోడ్డుపైకి నెట్టేశారు. 

నూకయ్య, శ్రీను ఇద్దరూ ఆమె పీక నులిమారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వారు అలా చేస్తున్న సమయంలో చంపేయాలి అంటూ సాయమ్మ ప్రోత్సహించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు పుష్ప పెద్ద కూతురు, ఆమె బంధువు బొచ్చు దాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నారాయణస్వామి తెలిపారు.సోంపేట సీఐ రవి ప్రసాద్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కోడల్ని అతి దారుణంగా చంపిన నిందితులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios