డోన్: ప్రియురాలితో ఏకాంతంగా బైక్‌పై వెళ్లిన యువకుడు రైల్వేట్రాక్‌పై అనుమానాస్పదస్థితిలో మృత్యువాత పడిన ఘటన కర్నూల్ జిల్లాలోని డోన్‌లో చోటు చేసుకొంది. రైలు ఢీకొనడంతోనే ప్రియుడు చనిపోయినట్టుగా ప్రియురాలు చెబుతోంది. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

డోన్ మండలంలోని మాల్యాల గ్రామంలో ఈ ఘటన  చోటు చేసుకొంది. మనోహార్ అనే  యువకుడు కొంత కాలంగా ఓ యువతితో ప్రేమిస్తున్నాడు. ప్రేమికులిద్దరూ బుధవారం నాడు ఏకాంతం కోసం బైక్‌పై వెళ్లారు. అయితే బైక్‌ను దూరంగా ఆపి రైల్వేట్రాక్‌కు వెపుకు వెళ్లిన సమయంలో రైలు ఢీకొట్టడంతో ప్రియుడు మనోహార్ మృతి చెందినట్టుగా ప్రియురాలు చెబుతోంది.

ఈ విషయమై ప్రియురాలి మాటలపై  మృతుడి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మనోహార్ మృతి చెందినట్టుగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ప్రియురాలి సెల్‌ఫోన్‌ను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.