ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ మరో యువకుడు ప్రాణత్యాగం

man suicide for ap special status
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ ఓ  యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. చిత్తూరు జిల్లాకు చెందిన సుధాకర్ అనే యువకుడు .. హోదా విషయంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తూ... దాని గురించే ఆలోచిస్తూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం చూసి తట్టుకోలేకపోయాడు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ ఓ  యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. చిత్తూరు జిల్లాకు చెందిన సుధాకర్ అనే యువకుడు .. హోదా విషయంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తూ... దాని గురించే ఆలోచిస్తూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం చూసి తట్టుకోలేకపోయాడు..

ఈ క్రమంలో హోదా కోరుతూ ఇవాళ ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘‘ నా చావుకు ఎవ్వరూ కారణం కాదు.. ప్రత్యేకహోదా మన హక్కు’’ అని సూసైడ్ నోట్‌లో రాశాడు.. సమాచారం అందుకున్న పోలీసులు సుధాకర్ ఇంటికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

loader