మనుషుల్లో సహనం నశించి.. చిన్న విషయానికే ఎదుటి వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు. తాజాగా అరటిపళ్ల విషయంలో చోటు చేసుకున్న చిన్న గొడవ... ప్రాణాల మీదకు తెచ్చింది. 

మనుషుల్లో సహనం నశించి.. చిన్న విషయానికే ఎదుటి వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు. తాజాగా అరటిపళ్ల విషయంలో చోటు చేసుకున్న చిన్న గొడవ... ప్రాణాల మీదకు తెచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా బిస్మిల్లా నగర్‌కి చెందిన ఖాజావలి చిలకలబావి వద్ద అరటి పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. అతని కొడుకు మస్తాన్ తండ్రికి సహయపడుతూ ఉండేవాడు.

ఈ నేపథ్యంలో చెకుమార్ ఖాన్ అనే వ్యక్తి అరటి పండ్లు కొనేందుకు వచ్చి బేరమాడాడు. అయితే ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన చెకుమార్‌ఖాన్ అరటిపళ్లు కోసే కత్తి తీసుకుని ఖాజావలి, అతని కొడుకు మస్తాన్‌ను పొడిచేశాడు.

వెంటే స్పందించిన స్థానికులు బాధితులను రిమ్స్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.