పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సహజీవనం చేస్తున్న యువతిపై అనుమానంతో ఆమె గొంతు కోశాడు ప్రియుడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా వుంది. 

పల్నాడు జిల్లా (palnadu district) సత్తెనపల్లిలో (sattenapalli) దారుణం జరిగింది. అనుమానంతో ఫాతిమా అనే యువతి గొంతు కోశాడు తులసీ రామ్ అనే వ్యక్తి. గత కొంతకాలంగా ఫాతిమాతో తులసీరామ్ సహజీవనం చేస్తున్నాడు. ఈ ఘటనలో ఫాతిమాకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఫాతిమా పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.