విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఓ యువకుడు ప్రమాదవశాత్తూ జారీపడ్డాడు. వైసీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనక దుర్గమ్మ దర్శనానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో నగరంలోని మల్లిఖార్జునపేటకు చెందిన శ్రీకాంత్‌తో పాటు అతని స్నేహితులు ముగ్గురు మద్యం సేవించి ఇంద్రకీలాద్రిపై నీటి ట్యాంక్ పక్కన పేకాట ఆడుతున్నారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులు అటువైపుగా రావడాన్ని గమనించిన శ్రీకాంత్.. భయంతో కొండపై నుంచి తప్పించుకునే యత్నంలో అదుపుతప్పి జారిపడ్డాడు.

అతడిని రక్షించేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రయత్నించినప్పటికీ.. విఫలమయ్యారు. ఎలాగో శ్రమించి శ్రీకాంత్‌ను రక్షించారు.. తీవ్రంగా గాయపడిన అతనిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.