Asianet News TeluguAsianet News Telugu

గొంతు, తల భాగంలో ఇతర మారణాయుధాలతో దాడి.. వ్యక్తి దారుణ హత్య..

పత్తికొండకు వెళ్లి వస్తానని చెప్పి పొలం నుంచి ఇంటికి బయలు దేరారు. అక్కడే కాపు కాసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూకుమ్మడిగా కత్తులు, ఇతర మారణాయుధాలతో అతని గొంతు, తల భాగంలో దాడి చేసి murder చేశారు. 

man murdered brutally kurnool
Author
Hyderabad, First Published Oct 26, 2021, 9:48 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

పత్తికొండ : పత్తికొండ మండలం కోతిరాళ్ల గ్రామంలో ఓ వ్యక్తి సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ పోలీసు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుమ్మిరాళ్ల మల్లికార్జున (47) ఉదయం భార్య సరోజతో కలిసి పొలానికి వెళ్లాడు.

కొంతసేపటి తరువాత తాను పత్తికొండకు వెళ్లి వస్తానని చెప్పి పొలం నుంచి ఇంటికి బయలు దేరారు. అక్కడే కాపు కాసిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మూకుమ్మడిగా కత్తులు, ఇతర మారణాయుధాలతో అతని గొంతు, తల భాగంలో దాడి చేసి murder చేశారు. 

కొంత సేపటికి అటుగా వచ్చిన Shepherds రక్తపు మడుగులో విగతజీవిగా పడున్న విషయాన్ని అతని భార్యకు తెలిపారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. 

సమాచారం అందుకు సీఐ ఆదినారాయణరెడ్డి, ఎస్సై భూపాలుడు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కర్నూలు నుంచి జాగిలాలను రప్పించి సమీప ప్రదేశాల్లో గాలింపు చేపట్టారు. హత్యకు Extramarital affair కారణం అయి ఉండొచ్చునని సీఐ ఆదినారాయణ రెడ్డి తెలిపారు.

మృతుడి cell phoneకి వచ్చిన కాల్ డేటాను పరిశీలిస్తున్నామన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతునికి కుమారులు శివకృష్ణ, శ్రీకాంత్ ఉన్నారు. 
గ్రామ సర్పంచి అంజనయ్య, ఎంపీటీసీ సభ్యుడు కృష్ణారెడ్డి, తేదేపా నాయకులు సాంబశివారెడ్డి , లోక్ నాథ్ తదితరులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని పత్తికొండకు తరలించారు. 

దారుణం.. భర్తకోసం ఇంటికి వెళ్లి.. బాలింత పట్ల వాలంటీర్ అసభ్యప్రవర్తన..

కత్తిపోట్లతో ప్రియురాలు హత్య, ఆస్పత్రిలో ప్రియుడు.. 
ఇదిలా ఉండగా.. ఒంగోలులో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. ఆమె పేరు నాగచైతన్య ఒంగోలు సమీప గ్రామ నివాసి.  నగరంలో ఒక ప్రైవేటు వైద్యశాలలో నర్సు గా పనిచేస్తుంది.  అతని పేరు  గాదే కోటిరెడ్డి.  గుంటూరు జిల్లా వాసి. ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.  Medical Representative పని చేస్తున్నాడు. తరచూ వైద్యశాలకు వెళ్లే క్రమంలో నాగచైతన్య తో పరిచయం ఏర్పడింది.

అది కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు Marriage చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమ్మాయి తల్లి చిన్నతనంలోనే కన్నుమూయడం, తండ్రి కూడా కొన్నాళ్ళ కిందట కాలం చేయడంతో.. సవతి తల్లి మాత్రమే ఉంది.  ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో యువకుడి కుటుంబీకులు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో నాగచైతన్య ఉద్యోగం వదిలి హైదరాబాద్ వెళ్లి అక్కడే ఓ hospitalలో పని చేస్తోంది. 

కోటిరెడ్డి ఈ నెల 22న హైదరాబాద్ కు వెళ్లి ఆమెను కలిశాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒక Lodgeలో గది అద్దెకు తీసుకున్నారు. 23 వ తేదీ రాత్రి నాగచైతన్య లాడ్జి గదిలోని murderకు గురైంది. కోటిరెడ్డి మాత్రం అదృశ్యమయ్యాడు.  

ఈ ఉదంతంపై చందానగర్ పోలీస్ స్టేషన్ లో హత్య కేసు నమోదైంది.  హైదరాబాద్ లాడ్జి గది నుంచి  అదృశ్యమైన కోటిరెడ్డి  సోమవారం ఉదయం ఒంగోలు  GGHలో దర్శనమిచ్చాడు.ఒంటి పై Sword stabsతో చికిత్స కోసం చేరాడు.  తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో నాగచైతన్య కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశామని,  అని తాను అపస్మారక స్థితిలోకి వెళ్లానని ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు అని చెబుతున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios