దారుణం.. భర్తకోసం ఇంటికి వెళ్లి.. బాలింత పట్ల వాలంటీర్ అసభ్యప్రవర్తన..
ఆ సమయంలో అతని భార్య ఇంట్లో ఉంది. ఆమె బాలింత. భర్త లేడని చెప్పడంతో అతని ఫోన్ నెంబర్ కావాలని అడుగుతూ ఆమెతో misbehave చేశాడు. వాలంటీర్ చర్యతో షాక్ అయిన ఆమె.. ఉన్న ఫలానా బయటకు పరుగులు తీసింది.
అమరావతి : గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల కు చెందిన గ్రామ వాలంటీర్ ఒక బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఆదివారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల 22న Village Volunteer మల్ల గోపి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు.
ఆ సమయంలో అతని భార్య ఇంట్లో ఉంది. ఆమె బాలింత. భర్త లేడని చెప్పడంతో అతని ఫోన్ నెంబర్ కావాలని అడుగుతూ ఆమెతో misbehave చేశాడు.
వాలంటీర్ చర్యతో షాక్ అయిన ఆమె.. ఉన్న ఫలానా బయటకు పరుగులు తీసింది. అతని ప్రవర్తనతో భయపడిపోయింది. ఇంటి పక్కనే ఉన్న మరో మహిళ ఫోన్ తీసుకుని విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది.
వెంటనే అక్కడికి husband చేరుకునేసరికి వాలంటీర్ పరారయ్యాడు. దీనిపై బాధితురాలు మరుసటి రోజు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఘటన మీద విచారించిన పోలీసులు.. ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కోటయ్య తెలిపారు.
వాలంటీర్ మీద చర్యలు తీసుకోవాలి : వాసిరెడ్డి పద్మ ఆదేశం
బాలింత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారులతో పాటు మాచవరం స్టేషన్ SHOతో ఆమె సోమవారం ఫోన్లో మాట్లాడి కేసు వివరాలు తెలుసుకున్నారు.
లాడ్డిలో రక్తపుమడుగులో ప్రియురాలు.. ఆస్పత్రిలో కత్తిగాట్లతో ప్రియుడు.. మిస్టరీ ఏంటంటే..
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించే ఏ స్థాయి ఉద్యోగి నైనా క్షమించరాదు అని
Vasireddy Padma అన్నారు. విద్యార్థినులకు నీలిచిత్రాలు చూపుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన సత్తెనపల్లి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడి విషయంలో కఠినమైన చర్యలు చేపట్టారన్నారు.
గుంటూరు రాజీవ్ గాంధీ నగర్ లో మానసిక దివ్యాంగురాలు పై అత్యాచార ఘటనపై, చిత్తూరు జిల్లా పీలేరు మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఏలూరు సబ్ రిజిస్టర్ ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనల పై పోలీసు ఉన్నతాధికారులతో ఆమె మాట్లాడారు.
గుంటూరులో నీచ ఉపాధ్యాయుడు..
ఇదిలా ఉండగా గుంటూరులో విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే బుద్దితప్పాడు. చదువు చెప్పాల్సిన తరగతి గదిలోనే చిన్నారులతో నీచంగా వ్యవహరించాడు. అభం శుభం తెలియని బాలికలకు బూతు సినిమాలు చూపిస్తూ వారితో అసభ్యంగా ప్రవర్తించాడు.
సత్తెనపల్లి పట్టణంలోని శాలివాహన నగర్ లో ఎంపిపిఎస్(ఉర్దూ) పాఠశాల నడుస్తోంది. ఈ స్కూల్లో హుస్సెన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తరగతి గదిలోనే నీలి చిత్రాలను చూడటమే కాదు చిన్నారులకు చూపించి లైంగికంగా వేధించేవాడు. ఇలా చాలారోజులుగా అతడు blue films చూపించి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నా వారు బయటకు చెప్పుకోలేకపోయారు.
అయితే తాజాగా ఓ విద్యార్థిణి తలనొప్పిగా వుందని సాకులు చెప్పి స్కూల్ కు వెళ్లడానికి నిరాకరించింది. దీంతో తల్లి ఆమెను గట్టిగా ప్రశ్నించగా ఉపాధ్యాయుడి వికృత చేష్టల గురించి బయటపెట్టింది. ప్రతిరోజూ బూతు సినిమాలు చూపించి వేధిస్తున్నాడంటూ టీచర్ హుస్సెన్ పాడుపనుల గురించి బయటపెట్టింది. దీంతో ఆమె మిగతా విద్యార్థిణులను కూడా ఆరాతీయగా తమను కూడా ఇలాగే వేధిస్తున్నాడని బయటపెట్టారు.
బాలికల తల్లిదండ్రులంతా కలిసి సదరు ఉపాధ్యాయున్ని ప్రశ్నించగా వారితో దురుసుగా వ్యవహరించాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే ఈ నీచుడిని తమకు అప్పగించాలంటూ విద్యార్థిణుల తల్లిదండ్రులు, స్థానికులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన విరమించారు.