అతనికి అప్పటికే వివాహమైంది. అయినప్పటికీ మరో వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. కాగా.... ఆమె కూతురిపై కూడా ఈ కామాంధుడి కన్ను పడింది. తాను సహజీవనం చేస్తున్న మహిళ లేని సమయంలో.. ఆమె కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read: భద్రాచలంలో బెంగళూరువాసి దారుణ హత్య

పూర్తి వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వణుకూరుకి చెందిన శివ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. ఎప్పటి నుంచో అతనికి సదరు మహిళ కూతురుపై కన్నే శాడు. అవకాశం కోసం ఎదురు  చూశాడు.  కాగా... ఈ నెల 16వ తేదీన మహిళ లేని సమయాన్ని తనకు అవకాశంగా మార్చుకున్నాడు.

ఈ నెల 16వ తేదీన మైనర్ బాలికకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి.... అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా...కూతురి ద్వారా నిజం తెలుసుకున్న సదరు మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే... ఇలా బాలికపై చాలా సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Alsp Read: కూతురిపై అత్యాచారం... నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష