విజయవాడ: కట్టుకున్న భార్య నిద్రలో వుండగానే అతి కిరాతకంగా హతమార్చడానికి ప్రయత్నించి ఆ తర్వాత తానుకూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఇలా ఉరేసుకున్న భర్త అక్కడికక్కడే చనిపోగా భార్య హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది.  

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలో ఓ జంట నివాసముంటోంది. అయితే హటాత్తుగా ఏమయ్యిందో తెలీదే కానీ ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అతడు మరో గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

వివాహిల మంటల్లో చిక్కుకుని అర్తనాదాలు చేయడంతో చుట్టుపక్కలవారు ఇళ్లవారు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పి కాలిన గాయాలతో వున్న ఆమెను హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే శరీరం మొత్తం కాలిపోవడంతో డాక్టర్లు కూడా కాపాడలేకపోయారు. దీంతో చికిత్సపొందుతూ ఆమె చనిపోచారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భర్త మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.