అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఇద్దరు చిన్నారులను తీసుకువెళ్లి చెరువులో పడేసిన దారుణ ఘటన ఇది. ఈ దారుణ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  చిత్తూరు జిల్లా  రామిరెడ్డిగారిపల్లికి చెందిన ఉదయ్ (28)కి మరో మహిళ హేమశ్రీ(23)తో వివాహేతర సంబంధం ఉంది. అయితే సదరు మహిళకు సంవత్సరం లోపు వయసు ఉన్న ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. కాగా..  వారి అక్రమ సంబంధానికి ఈ చిన్నారులను వారు అడ్డుగా భావించారు. ఈ క్రమంలో చిన్నారులను చింతపర్తివారిపల్లి వద్ద నడిమోడి కుంటలో పడేశారు. 

ఆపై వారిద్దరూ పురుగుల మందు తాగారు. దీంతో వారిద్దరూ అపస్మారకస్థితిలోకి వెళ్లారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కొన ఊపిరితో కట్టుమిట్టాడుతున్న వారిద్దరినీ పీలేరు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.