సిగరెట్ తాగొద్దన్నందుకు వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పంటించి హత్య..
సిగరెట్ తాగొద్దని వారించినందుకు ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి, నిప్పంటించాడో వ్యక్తి. దీంతో అతను చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.

సత్యసాయి జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. సిగరెట్ తాగొద్దని వారించినందుకు ఓ యువకుడిపై హత్యయత్నం చేశాడో వ్యక్తి. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం శివరంలో ఈ దారుణం వెలుగు చూసింది.
మహంతీష్ అనే వ్యక్తిని సిగరెట్ తాగొద్దని రంగనాథ్ అనే యువకుడు వారించాడు. దీంతో కోపానికివచ్చిన మహంతీష్ రంగనాథ్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని బెంగళూరులోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.