Asianet News TeluguAsianet News Telugu

బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడి.. యువకుడికి 20 యేళ్ల జైలు శిక్ష..

పాఠశాలకు వెళుతున్న ఆ బాలికను ఆటో డ్రైవర్ సాగర్ బాబు మాయమాటలు చెప్పి 2015 డిసెంబర్ 15న ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

man get 20 yrs in jail for sexual assault on minor girl in andhrapradesh
Author
Hyderabad, First Published Nov 9, 2021, 9:01 AM IST

పెద కాకాని : బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన యువకుడికి సోమవారం కోర్టు 20 యేళ్లు జైలు శిక్ష విధించింది. పెదకాకాని పోలీసుల కథనం ప్రకారం... పెదకాకాని ప్రాంతానికి చెందిన బాలిక 8వ తరగతి చదువుతోంది. 

పాఠశాలకు వెళుతున్న ఆ బాలికను ఆటో డ్రైవర్ సాగర్ బాబు మాయమాటలు చెప్పి 2015 డిసెంబర్ 15న ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

నిందితుడు సాగర్ బాబుతో పాటు అతడికి సహకరించిన వేల్పుల కిషోర్ బాబు, కొండేటి శ్రీనివాసరావు, రాణిలపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 

బాలిక మీద ఆటో డ్రైవర్ లైంగిక దాడి చేసినట్టు నిర్థారణ కావడంతో నిందితుడు సాగర్ బాబుకు గుంటూరులోని Pocso Special Court జడ్జి ఆర్.శ్రీలత 20యేళ్లు Imprisonmentతో పాటు... రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ముగ్గురి మీద నేరం రుజువు కానందున వారిమీద కేసు కొట్టేసినట్టు తెలిపారు. కేసులో పీపీగా శ్యామల వాదనలు వినిపించారు. 

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఇద్దరు యువకులను బంధించిన కుటుంబీకులు

బాలికపై అత్యాచారం కేసులో జీవితాంతం జైలు...

ఇలాంటిదే హైదరాబాద్ లోనూ నాంపల్లి కోర్టు గతనెలలో ఓ కేసులో తీర్పునిచ్చింది.మూడేళ్ల క్రితం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో dalit girlపై జరిగిన molestation కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.  నిందితుడు ఎడ్ల రమేష్ (45) పై ఆరోపణలు నిర్ధారణ కావడంతో.. అతన్ని జీవితాంతం జైలులోనే ఉంచాలని అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  

దాంతోపాటు 20 వేల జరిమానా విధించింది.  ఈ కేసులో అక్టోబర్ 12న అదనపు Metropolitan Sessions Court న్యాయమూర్తి బి సురేష్ 22 పేజీల తీర్పును ఇచ్చారు. 2018 లో 13 ఏళ్ల బాలికపై ఎడ్ల రమేష్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.  

ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుల సంఘాల వారు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.  సైఫాబాద్  ఏసిపి వేణుగోపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో  విచారణ చేపట్టి నిందితులపై ఫోక్సో,  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

బాధితురాలికి ఏడు లక్షల రూపాయలు Compensation ప్రభుత్వం నుంచి ఇప్పించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని కోర్టు ఆదేశించింది.  ఆ డబ్బులు 80 శాతం ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని 20 శాతం నగదును ఆమెకు అందజేయాలని ఆదేశించింది.  దోషికి విధించిన జరిమానా పరిహారం రెండు నెలల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ కేసులో ఆలస్యంగానైనా  బాధితురాలికి  కొంత న్యాయం జరిగిందని జరిగిందని ఈ తీర్పు విన్న వాళ్లు  హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి శిక్షణ వల్ల నిందితుల్లో కాస్తయినా భయం వస్తుందని... మరోసారి ఇలాంటి వాటికి పాల్పడకుండా ఉంటారని ఆశిస్తున్నారు. 

మరికొందరు మాత్రం  ఎన్ కౌంటర్లు చేసినా, ఇంతటి కఠిన శిక్షలు విధించినా.. కూడా ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండలేకపోతున్నారని.. ప్రతీరోజూ ఏదో ఒక చోట.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios