ఓ వివాహితతో అక్రమసంబంధం పెట్టుకోవడంతో పాటు.. ఆమె కూతురిని కూడా లైంగిక వేధించాడు ఓ కామాంధుడు. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే....నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ మహిళ భర్తనుంచి విడిపోయి కుమార్తెతో కలిసి వేరుగా నివసిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌తో సహజీవనం చేస్తోంది. యుక్తవయస్సుకు వచ్చిన ఆమె కుమార్తెపైనా శ్రీనివాస్‌ కన్నేశాడు. ఆమెను లొంగదీసుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈవిషయం ఎవరికైనా చెబితే ఆమెతో పాటు తల్లిని చంపేస్తానని బెదిరించాడు.

ఈ క్రమంలో బాధిత యువతి గర్భందాల్చింది. శ్రీనివాస్‌ ఆమెకు మాత్రలు ఇచ్చి గర్భం పోయేలా చేశాడు. తిరిగి తన కామవాంఛను తీర్చుకోసాగాడు. అతని చేష్టలతో విసిగిపోయిన యువతి జరిగిన విషయాన్ని తల్లికి తెలియజేసింది. మహిళ అతనిని నిలదీయటంతో శ్రీనివాస్‌ ఇద్దరిని ఇంటిలో నిర్భందించాడు. 3 రోజుల కిందట అతని చెరనుంచి తప్పించున్న తల్లీకూతుళ్లు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు.