మచిలీపట్టణంలో వ్యక్తి మృతి, మృతుడి సోదరుడు ఇటీవలే కరోనాతో మృతి

మచిలీపట్టణంలో గురువారం నాడు ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఇటీవలనే కరోనా వ్యాధి లక్షణాలతో మరణించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు

man dies heart arrest at machilipatnam in krishna district

మచిలీపట్టణం:మచిలీపట్టణంలో గురువారం నాడు ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఇటీవలనే కరోనా వ్యాధి లక్షణాలతో మరణించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మృతదేహాన్ని పరీక్షించిన తర్వాతే విషయం చెబుతామని వైద్యులు ప్రకటించారు.

కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కృష్ణా జిల్లా కూడ ఒకటి. మచిలీపట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవలనే కరోనా వ్యాధి కారణంగా మృతి చెందాడు.

 అయితే అతని సోదరుడే గురువారం నాడు మృతి చెందడంతో కరోనాతోనే అతను మృతి చెందాడా లేదా  ఇతరత్రా కారణాలతో మృతి చెందాడా అనే విషయాన్ని వైద్యులు తేల్చనున్నారు. మరో వైపు మృతుడి కుటుంబసభ్యులు మాత్రం వేరే కారణం చెబుతున్నారు. గుండెపోటుతోనే అతను చనిపోయాడని స్పష్టం చేశారు.

Also read:కరోనా ఎఫెక్ట్: తిరుమల వీధుల్లో వన్యప్రాణుల సంచారం, 128 ఏళ్ల వాతావరణం

ఇదిలా ఉంటే మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఏ కారణంగా అతను మరణించాడో తేల్చనున్నారు.గురువారం నాడు ఆయన మృతితో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే స్థానికుల అనుమానాలు తీరాలంటే వైద్యులు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నాటికి 348 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.9 మంది ఈ వ్యాధి నుండి కోలుకొన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నాడు రాత్రి నుండి గురువారం నాడు ఉదయం వరకు ఒక్క కొత్త కేసు కూడ నమోదు కాలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios