మృతదేహాన్ని దుప్పట్లో మూటగట్టి.. ఇంటిముందు పడేసిన దుండగులు.. దాంతోపాటు నగదు, ఉత్తరం....

రెండు రోజుల్లో ఇంటికొస్తానన్న కొడుకు.. అర్థరాత్రి శవంగా దుప్పట్లో చుట్టి ఇంటిముందు తేలాడు. అతడి మృతదేహాన్ని పడేసి వెళ్లిన వారు ఓ కవర్ కూడా వదిలేసి వెళ్లారు. 

Man dead body wrapped in blanket, and dropped in front of the house, andhrapradesh - bsb

ప్రకాశం : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి మృతదేహాన్ని దుప్పట్లో మూటగట్టి ఇంటి ముందు రోడ్డుపై పడేసి వెళ్లారు దుండగులు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మోటుకుల గ్రామంలో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన గురించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

ముటుకుల గ్రామానికి చెందిన ఉప్పు లింగాలు అనే వ్యక్తి కుమారుడు ఉప్పు శ్రీను (35).  కూలీ పనులు చేసుకుంటాడు. ఇటీవల కూడా పనుల నిమిత్తం వేరే ఊరికి వెళ్ళాడు. బుధవారం ఉదయం శ్రీను తల్లికి ఫోన్ చేశాడు. రెండు రోజుల్లో పని డబ్బులు వస్తాయని.. అవి వచ్చాక ఇంటికి వస్తానని తల్లికి చెప్పాడు. మరుసటి రోజు అనగా గురువారం అర్ధరాత్రి.. గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఓ దుప్పటి మూటను తీసుకువచ్చి వారి ఇంటి ముందున్న రోడ్డు మీద పడేశారు.

ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చినంత వేగంగానే వెళ్ళిపోయారు. అర్థరాత్రి పూట కారు శబ్దం కావడంతో చుట్టుపక్కల వారు లేచారు.  ఇంతలో శ్రీను తండ్రి ఉప్పు లింగాలు కూడా లేచాడు. తమ ఇంటి ముందే రోడ్డుపై దుప్పటి మూట ఉండడంతో... అదేంటో చూడడానికి అందరితో పాటు కలిసి వెళ్ళాడు. అది విప్పి చూడగా అందులో శ్రీను మృతదేహం కనిపించింది. అది చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి..

మృతదేహంతో పాటు ఆ దుప్పటి మూటలో ఒక కవర్ కూడా ఉంది.  అందులో రూ.35వేలు నగదు, ఒక లెటర్ ఉన్నాయి. ఇది చూసిన గ్రామస్తులు, తండ్రి విషయాన్ని వెంటనే విఆర్వోకు, పుల్లలచెరువు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, దాంతో పాటు ఉన్న లేఖను స్వాధీనం చేసుకున్నారు.

 అయితే ఆ లెటర్లో.. ‘ఇతని మృతితో మాకు ఎలాంటి సంబంధం లేదు.  పనిచేస్తున్న చోట ప్రమాదవశాత్తు చనిపోయాడు. అందుకే మృతదేహాన్ని ఇంటి దగ్గర పడేసి వెడుతున్నాం’ అని రాసి ఉంది. ఈ మేరకు ఎస్సై రిటర్న్ లోని వివరాలు తెలిపారు. దీని మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువచ్చి ఎవరు పడేశారు?  అతను ఎలా మరణించాడు?  అనే దిశగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

పుల్లల శీనుకు పెళ్లయింది.  ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. .  భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా భార్య పుట్టింట్లో ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios