ఓ మహిళ కట్టుకున్న భర్తని, కడుపున పుట్టిన బిడ్డని కాదని.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అక్కడితో ఆగలేదు.. తన ప్రియుడితో కలిసి పరారవ్వాలని పథకం వేసింది. ప్రియుడితో కలిసి పారిపోతుండగా... ఆమె తండ్రి గమనించి అడ్డుకున్నాడు. కాగా.. కన్న తండ్రి అని కూడా చూడకుండా.. ప్రియుడి చేత తండ్రిపై దాడి చేయించింది. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పాత ఊరికి చెందిన చింతపల్లి శేషారత్నం అనే మహిళకు వివాహమై.. స్కూలుకి వెళ్లే కుమార్తె ఉంది. కాగా.. రోజూ కూతుర్ని స్కూల్ కి పంపే క్రమంలో.. ఆ స్కూల్ బస్సు డ్రైవర్ తో శేషారత్నానికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ క్రమంలో ఆమె భర్త, కూతుర్ని కాదని.. మంగళవారం రాత్రి ప్రియుడితో కలిసి పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో.. వారిని శేషారత్నం తండ్రి గమనించాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించగా..ప్రియుడి చేత కన్న తండ్రిపై దాడి చేయించింది. అతను కత్తితో శేషారత్నం తండ్రి మెడను కోసేశాడు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.