Asianet News TeluguAsianet News Telugu

తాడేపల్లి గూడెంలోప్రేమోన్మాది.. ప్రేమకు ఒప్పుకోలేదని యువతి గొంతుకోసి.. అడ్డొచ్చిన తల్లి, చెల్లిపై దాడి...

తన ప్రేమను నిరాకరించిందని ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. అర్థరాత్రి ఆమె ఇంట్లో దూరి, చాకుతో గొంతు కోశాడు. అడ్డొచ్చిన ఆమె చెల్లి, తల్లి మీద కూడా దాడి చేశాడు. 

man cut girls throat for not agree to his love proposal in  west godavari district
Author
First Published Jan 6, 2023, 11:37 AM IST

పశ్చిమగోదావరి జిల్లా : పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ ప్రేమోన్మాది యువతి గొంతు కోశాడు. అడ్డొచ్చిన తల్లి, చెల్లెలి మీద కూడా చాకుతో దాడికి దిగాడు. ఈ ఘటన తాడేపల్లి గూడెం గ్రామీణ మండలం కొండ్రుప్రోలులో గురువారం జరిగింది. అర్థరాత్రి దాటిన యువతి ఇంటికి వచ్చిన దుండగుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.

రాజులపాటి కల్యాణ్ అనే యువకుడు బాధిత యువతిని ప్రేమిస్తున్నానంటూ రెండు నెలలుగా వెంటపడతున్నాడు. అయితే దీనికి యువతి నిరాకరించడంతో కక్ష పెంచుకుని ఈ దాడికి పాల్పడ్డాడు. అర్థరాత్రి యువతి ఇంటికి వచ్చి చాకుతో ఆమె గొంతు కోశాడు. ఇది చూసిన తల్లి, చెల్లెలు అడ్డురాగా.. వారిమీద కూడా చాకుతో దాడి చేశాడు.

వీరి కేకలకు అక్కడికి చేరుకున్న స్థానికులు రక్తపుమడుగులో పడి ఉన్న ముగ్గురిని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడు కల్యాణ్ కూతురి వెంటపడి వేధిస్తుండడంతో యువతి తండ్రి అతడిని పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న తాడేపల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

నన్ను ‘పుడింగి’ అన్నావంటే.. నీకంటే బలవంతుడినని ఒప్పుకున్నట్టే.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి కౌంటర్...

ఇదిలా ఉండగా, జనవరి 4వ తేదీన ఇలాంటి ఘటనే తెలంగాణలోని హన్మకొండలో జరిగింది. హన్మకొండ జిల్ల కాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. పెళ్లికి అంగీకరించడం లేదని ప్రేయసి గొంతు కోశాడు. దీంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మంగళవారం నాడు మండలంలోని కడిపికొండలో జరిగింది. మడికొండ పోలీస్ ఇన్ స్పెక్టర్ గుజ్జేటి వేణు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...

కాజీపేట మండలం కపిడికొండకు చెందిన సివ్వి శ్రీనివాస్ (35).. తన గ్రామానికే చెందిన ఓ యువతి (26)ను ప్రేమించాడు. ఆమె కూడా ఇతడిని ప్రేమించింది. అయితే, ఇద్దరి మతాలు వేరు. అందుకే శ్రీనివాస్ ఆమె కోసం మతం కూడా మార్చుకున్నాడు. కొంతకాలం వీరి ప్రేమ బాగానే సాగింది. అయితే పెళ్లి చేసుకుందామనుకునేసరికి యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమకు, పెళ్లికి ఒప్పుకోలేదు.

దీంతో ఇద్దరి మధ్య కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి ఇదే విషయంగా శ్రీనివాస్ యువతి ఇంటికి వెళ్లాడు. తమ పెళ్లి గురించి మరోసారి యువతిని నిలదీశాడు. తమ కుటుంబ సభ్యులు వద్దంటున్నారని ఆమె అంగీకరించకపోవడంతో.. శ్రీనివాస్ తనతో తెచ్చుకున్నపదునైన ఆయుధంతో యువతి గొంతు, చేయి కోశాడు. 

ఇది చూసిన కుటుంబసభ్యులు ఆగ్రహానికి వచ్చి... అతడి మీద దాడి చేశారు. చితకబాదారు. ఈ మేరకు సమాచారం అందండంతో మడికొండ పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు. యువతిని వరంగల్ లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ప్రాణాపాయం లేదని తెలిపారు. పోలీసులు ఈ కేసే విచారణ చేస్తున్నట్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios