Asianet News TeluguAsianet News Telugu

నన్ను ‘పుడింగి’ అన్నావంటే.. నీకంటే బలవంతుడినని ఒప్పుకున్నట్టే.. చంద్రబాబుకు పెద్దిరెడ్డి కౌంటర్...

చంద్రబాబు కుప్పం టూర్ లో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి, బాబుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చంద్రబాబుకు పుడింగి అంటే అర్థం తెలుసా? అంటూ పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. 

Minister Peddi Reddy counter to Chandrababu Naidu in chittoor
Author
First Published Jan 6, 2023, 7:36 AM IST

చిత్తూరు : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో భాగంగా పెద్దిరెడ్డిపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.  దీంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డిని ఉద్దేశించి ‘పుంగనూరు పుడింగి’ అంటూ వ్యాఖ్యానించడం మీదపెద్దిరెడ్డి  స్పందించారు. అసలు చంద్రబాబుకు పుడింగి అంటే అర్థం తెలుసా అని ఎద్దేవా చేశారు.  మాట్లాడితే ‘పుంగనూరు పుడింగి’  అంటూ  నా గురించి అంటున్నారు.. ఇంతకీ ఆయనకు ఆ మాటకు అర్థం తెలుసా అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. 

చిత్తూరు జిల్లా  సదుం మండలం ఎర్రాతివారి పల్లెలో గురువారం మంత్రి పెద్దిరెడ్డి  మీడియాతో మాట్లాడారు. ఆ సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘పుడింగి’ అంటే అర్థమేమిటో తెలియని చంద్రబాబా నన్ను విమర్శించేది అని ఎద్దేవా చేశారు. ఆయన కంటే బలవంతులమని ‘పుడింగి’ అనే మాటతో ఒప్పుకున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఒక్క ఓటుతోనే జిల్లాపరిషత్ స్థానాన్ని కైవసం చేసుకున్నామని.. ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో.. ఇది బిగినింగ్ మాత్రమే.. కుప్పంలో కప్పం కట్టాలా? : చంద్రబాబు

పాల సేకరణ ధర విషయంలో చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు డైరీ కంటే తాము కనీస ధర అధికంగానే ఇస్తున్నామని తెలిపారు. హెరిటేజ్ డైరీ పాల సేకరణ ధరలు దమ్ముంటే చంద్రబాబు నాయుడు బయటపెట్టాలని సవాల్ చేశారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయం అని జోస్యం చెప్పారు. ఇప్పటికే కుప్పంలో స్థానిక సంస్థలన్నింటిని వైసిపి కైవసం చేసుకుందన్నారు. 

కాలేజీలో చదువుకునే సమయం నుంచి కూడా చంద్రబాబుపై పైచేయి తనదేనని పెద్దిరెడ్డి తెలిపారు. చంద్రబాబు ‘పుంగనూరులో నన్ను ఓడించడం నీ తరం కాదు. అంతే కాదు  వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఎలా గెలుస్తావో కూడా చూస్తాను..’  అంటూ మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మైనింగ్లో కమిషన్లు తీసుకుంటున్నామని ఆరోపిస్తున్నారని.. చౌకబారు విమర్శలు ఇప్పటికైనా ఆపాలని మంత్రి పెద్దిరెడ్డి  అన్నారు. 

ఇదిలా ఉండగా, గురువారం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నిన్నటి నుంచి కుప్పంలో ఏం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా చూస్తున్నారని అన్నారు. ఒక వ్యక్తి అరాచక శక్తిగా తయారయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడన్నారు. ఇలా చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 

ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సమయంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని.. ఆయన పాదయాత్రను ఎన్నడూ అడ్డుకోలేదని అన్నారు. పోలీసులు కూడా ఆయన పాదయాత్నకు పూర్తిగా సహకరించారని, కానీ ఇప్పుడు జగన్ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత మళ్లీ తాను ముఖ్యమంత్రి అయ్యాక కూడా జగన్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. విజయమ్మ, షర్మిలు రాష్ట్రంలో వివిధ చోట్ల సభలు పెట్టారని.. వాటిని ఏనాడూ తాము అడ్డుకోలేదని చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios