Asianet News TeluguAsianet News Telugu

పేకాటలో ఇచ్చిన అప్పు తీర్చమని ఒత్తిడి.. విషం తాగి వ్యక్తి మృతి !

కృష్ణాజిల్లా లో విషాదం చోటు చేసుకుంది. అప్పులు బాధ తాళలేక విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

man committed suicide due to debts in playing cards in krishnadistrict - bsb
Author
Hyderabad, First Published Apr 24, 2021, 9:09 AM IST

కృష్ణాజిల్లా లో విషాదం చోటు చేసుకుంది. అప్పులు బాధ తాళలేక విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.  

నూజివీడు మండలం తుక్కుల్లురు గ్రామానికి చెందిన యేసు(42) మొన్న ఉదయం అప్పుల బాధ తాళలేక పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన కుటుంబీకులు అతన్ని జియంహెచ్ ఆసుపత్రిలో చేర్చించారు. 

అక్కడ యేసు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. యేసు గ్రామంలో ముగ్గురు దగ్గర అప్పులు తీసుకుని, తీర్చమని ఒత్తిడి తేవడంతో ఆత్మహత్య యత్నం చేసుకున్నట్లు సమాచారం.

తన చావుకు గ్రామానికి చెందిన ముగ్గురు కారణమని.. వారు తనకు పేకాటలో అప్పు ఇచ్చి.. తీర్చమని నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని యేసు విషం తాగాడు. 

దీని మీద కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా నిషేధిత పేకాటలో అప్పులు ఇచ్చిన 
ముగ్గురు వ్యక్తులు తన చావుకు కారణం అన్న వీడియో పై పోలీసులు ఎం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

అయితే ముగ్గురు పేకాట రాయుళ్లు పై కేసు లేకుండా రాజీకి  కొందరు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios