ఎన్నిసార్లడిగినా తల్లిదండ్రులు పెళ్లి చేయడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన విశాఖపట్నంలో జరిగింది. అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ శివలింగపురానికి చెందిన భీమవరపు నవీన్(24)  నిత్యం తాగొచ్చి పెళ్లి చేయమంటూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. 

పెళ్లి చేయకపోతే చనిపోతానంటూ బెదిరింపులకు దిగేవాడు. ఎన్నిసార్లు అడిగినా, బెదిరించినా పెళ్లి ఊసు ఎత్తడం లేదని తీవ్రమనస్థాపానికి లోనైన నవీన్.. చివరికి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

రోజూ లాగే బుధవారం కూడా ఆత్మహత్య చేసుకుంటానంటూ ఇంట్లోకి వెళ్లడంతో మారోమారు బెదిరిస్తున్నాడని అనుకున్నారు కుటుంబసభ్యులు. అయితే ఇంట్లోకి వెళ్లిన నవీన్ చున్నీతో ఫ్యాన్ హుక్‌కి ఉరి వేసుకుని అఘాయిత్యం చేసుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.