కృష్ణ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో శుక్రవారం హైటెన్షన్ వాతావరం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే వీరిని కోగంటి బాబు పోలీస్ స్టేషన్ నుంచి విడిపించారు. తమను విడిపించిన బాబుపై ప్రశంసలు కురిపిస్తూ అరెస్ట్ అయిన రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు వాట్సాప్ స్టేటస్ పెట్టాడు.

దీనిని చూసిన పోలీసులు రాజశేఖర్ రెడ్డిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. తనను మరోసారి స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడాన్ని బాధితుడు అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రాజశేఖర్‌రెడ్డి ఆత్మహత్య వార్తను తెలుసుకొని మేనత్త సరస్వతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు రాజశేఖర్‌రెడ్డి మృతదేహంతో జాతీయ రహదారిపై బంధువుల రాస్తారోకో చేశారు. అతని మరణానికి పోలీసులే కారణమంటూ ఆరోపించారు.