డేటింగ్ యాప్ నిర్వాహకుల వేధింపులు: విశాఖ పట్టణానికి చెందిన యువకుడు సూసైడ్

విశాఖపట్టణానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. డేటింగ్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా సూసైడ్ చేసుకున్నాడు. డేటింగ్ యాప్ నిర్వాహకులకు లక్ష రూపాయాలు  చెల్లించాడు 

Man  Commits Suicide For Harassment InVisakhapatnam


విశాఖపట్టణం: Dating APP  నిర్వాహకుల వేధింపుల కారణంగా Visakhapatnam కి చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్టణానికి చెందిన  ఓ యువకుడు డేటింగ్ యాప్ నిర్వాహకులను సంప్రదించాడు. లక్ష రూపాయాలను చెల్లించాలని యువకుడు డేటింగ్ యాప్ నిర్వాహకులు చెప్పారు. దీంతో యువకుడు డేటింగ్ యాప్ నిర్వాహకులకు లక్ష రూపాయాలను చెల్లించాడు. డబ్బులు చెల్లించిన తర్వాత  కూడా డేటింగ్ యాప్ నిర్వాహకులు స్పందించలేదు. 

దీంతో డేటింగ్ యాప్  నిర్వాహకులకు  జయసూర్య ఫోన్ చేశాడు. యువకుడు ఫోన్లు చేసినా డేటింగ్ యాప్ నిర్వాహకులు స్పందించలేదు. పదే పదే ఫోన్లు చేస్తే తమతో  సంప్రదింపులు చేసిన అంశానికి సంబంధించిన మేసేజ్ లను బయట పెడతామని డేటింగ్ యాప్ నిర్వాహకులు జయసూర్యను బెదిరించారు. డేటింగ్ యాప్ నిర్వాహకుల బెదిరింపులతో భయపడిన యువకుడు  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గతంలో కూడా  డేటింగ్ యాప్  నిర్వాహకులు వేధింపులకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి  తన మీద లైంగిక దాడికి పాాల్పడినట్టుగా ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన ఈ ఏడాది జూన్ 3న చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ కు చెందిన వ్యక్తి తనకు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైనట్టుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 డేటింగ్ యాప్ లో అమ్మాయితో ప‌రిచ‌యం పెంచుకొని ఆమెను డిన్న‌ర్ కు ఆహ్వానించి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు.  ఈ ఏడాది మార్చి 24న ఈ ఘటన చోటు చేసుకుంది.  నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు, ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన ఓ మ‌హిళ బెంగ‌ళూరులో ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్ లో  న‌ర్సుగా ప‌ని చేస్తున్నారు.  డేటింగ్ యాప్ లో ర.జిత్ అనే యువకుడు ఈ నర్సుతో స్నేహం చేశారు. మార్చి 24న ఆమెను రజిత్ డిన్నర్ కు పిలిచాడు. డిన్నర్ తర్వాత ఆమెను తన గదికి తీసుకెళ్లాడు. గదిలో రజిత్ తో పాటు అతని స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

డేటింగ్ యాప్, మ్యాట్రిమోని సైట్ల యాప్ ల ద్వారా అమ్మాయిలను మోసం చేసి డబ్బులు కొట్టేసిన నిందితుడిని పోలీసులు చెేప్పారు. 2021 సెప్టెంబర్ 7న ఈ ఘటన చోటు చేసుకుంది. 11 మంది అమ్మాయిలను మోసం చేసిన వ్యక్తిని  చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.  ఎంటెక్ చదువును మధ్యలోనే మానేసిన శ్రీనివాస్ ది ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలం కోటికాలపూడి గ్రామం, శ్రీనివాస్ పలువురు మహిళలను మోసం చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

ఒక్కో అమ్మాయితో మాట్లాడే సమయంలో నిందితుడు శ్రీనివాస్ ఒక్కో సిమ్ కార్డును ఉపయోగించేవాడు. ఒంగోలుకు చెందిన ఐటీ ఉద్యోగిని రూ. 27 లక్షలు ,నరసరావుపేటకు చెందిన ఐటీ ఉద్యోగిని రూ. 40 లక్షలు, చిత్తూరుకు చెందిన ఐటీ ఉద్యోగిని రూ.1.40 లక్షలు,  మదనపల్లెకు చెందిన యువ వైద్యురాలు రూ. 7 లక్షలను నిందితుడు వసూలు చేశాడని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.మరో ఏడుగురు కూడా నిందితుడు మోసపోయారని పోలీసులు గుర్తించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios