కరోనా లక్షణాలున్నాయని భయం... టెస్టుకు వెళ్లకుండానే ఆత్మహత్య..!
కరోనా ఎంతోమందిని పొట్టన బెట్టుకుంటోంది. కాస్త లక్షణాలు కనిపిస్తే చాలు కరోనానే అని భయపడి ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
కరోనా ఎంతోమందిని పొట్టన బెట్టుకుంటోంది. కాస్త లక్షణాలు కనిపిస్తే చాలు కరోనానే అని భయపడి ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
కరోనా సోకితే వెలి వేస్తారన్న భయం, చూసే వాళ్లు ఉండరన్న వేదన, ఒంటరి అయిపోతామన్న ఆందోళనలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మరో విషాద ఘటనే గన్నవరం మండలం మర్లపాలెంలో చోటుచేసుకుంది.
మర్లపాలెంకు చెందిన 74యేళ్ల హరిబాబు గత మూడ్రోజులుగా జ్వరం ఇతర లక్షణాలతో బాధపడుతున్నాడు. దీంతో చుట్టు పక్కల వాళ్లు, స్థానికులు అతనికి కరోనా వచ్చిందంటూ గొడవ గొడవ చేయడం మొదలు పెట్టారు.
స్థానికుల ఈ మాటలు, హడావుడితో హరిబాబు బెదిరిపోయాడు. ఈ వయసులో తనకు కరోనా వచ్చి నలుగురిలో ఇబ్బందులు పడుతున్నానంటూ వేదన చెందాడు. తీవ్రమనస్తాపం చెంది కరోనా టెస్టు చేయించుకోకుండానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఎవ్వరూ చూడని సమయంలో గ్రామంలోని చెరువులోకి దూకి హరిబాబు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గ్రామంలోకి పొక్కడంతో పోలీసులకు సమాచారం అందించారు.
మృతదేహాన్ని బైటికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం పోలీసులు
ఆస్పత్రికి తరలించారు.