శ్రీకాకుళం: భార్యభర్తల మద్య గొడవ రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న విషాద సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. భార్యను అతి కిరాతకంగా నరికి చంపిన భర్త తాను కూడా అంతే దారుణంగా హత్యహత్యకు పాల్పడ్డాడు. ఇలా క్షణికావేశంలో ఇద్దరి ప్రాణాలు బలయ్యాయి.   

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం వేల్పురాయి గ్రామానికి చెందిన బాలి వెంకటరావు-అక్కమ్మలు భార్యభర్తలు. అయితే గతకొంత కాలంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. కానీ శనివారం ఈ గొడవ కాస్తా పెద్దదై ఆవేశంలో భార్యను గడ్డపారతో తలపై పొడిచి అతి దారుణంగా హత్యచేశాడు భర్త వెంకటరావు. 

read more   ‘కోరిక తీర్చకుంటే మిమ్మల్ని అంతం చేస్తా’

ఆ తర్వాత అతడు కూడా అంతే దారుణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీమవరం జాతీయ రహదారిపై బైక్ పై మితిమీరిన వేగంతో వెళుతూ ఎదురుగా వచ్చిన ఓ లారీని ఢీకొట్టాడు. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. 

కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.