ఆమెకు అప్పటికే వివాహమైంది. ఓ కుమార్తె కూడా ఉంది. కాగా కొన్ని కారణాల వల్ల భర్తకు దూరమైంది. అయితే.. భర్తకు విడాకులు ఇవ్వకుండానే.. కూతురితో ఒంటరిగా జీవిస్తోంది. కాగా.. ఆమెకు కొంత కాలం క్రితం ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనితో వివాహితకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో.. అతనితో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. కాగా... ఆమెతో సహజీనం మొదలుపెట్టిన వ్యక్తి మాత్రం వక్రబుద్ధితో ఆలోచించాడు. సదరు మహిళ కుమార్తె పై కన్నువేశాడు. ఆ బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడు. ఈ సంఘటన తెనాలిలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పట్టణానికి చెందిన ఓ మహిళ భర్త నుంచి విడాకులు తీసుకోకుండానే కూతురితో కలసి అప్పటికే వివాహమై పిల్లలు ఉన్న వ్యక్తితో 2009 నుంచి సహజీవనం చేస్తోంది.
సదరు వ్యక్తి కూడా భార్య నుంచి విడాకులు పొందలేదు. మహిళ కుమార్తె, తన కుమార్తెను అతనే బీటెక్‌ చదివించాడు. ఇరువురు కుమార్తెల పెంపకం విషయంలో ఘర్షణలు జరుగుతున్నాయి. 

 అప్పటి వరకు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివశించిన వీరు మూడేళ్ల క్రితం త్రీ టౌన్‌ పరిధిలోని ఇందిరా కాలనీకి వచ్చారు. ఇరువురి మధ్య వివాదం నడుస్తున్న క్రమంలో తన కుమార్తె స్నానం చేస్తుండగా వీడియోలు తీశాడంటూ మహిళ  ఫిర్యాదు చేసింది. అయితే సీఐ బి.హరికృష్ణ ఇరువురినీ పిలిపించి మాట్లాడారు. ఇరు పక్షాలు రాజీ అయ్యాయని, కేసు ఉద్దేశపూర్వకంగానే పెట్టినట్టు భావిస్తున్నామని సీఐ వివరించారు.