ఓ మైనర్ బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతి దారుణంగా కొట్టి.. చంపేసి గోతంలో పడేశారు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నుదురుపాడుకు చెందిన లక్ష్మి 10 ఏళ్ల క్రితం దావల నాగేశ్వరబాబును కులాంతర వివాహం చేసుకుంది. వీరికి యశ్వంత్‌కుమార్, ఆరేళ్ల జ్యోతి ఉన్నారు.
ఏడాదిన్నర క్రితం లక్ష్మి భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో మేనమామ పల్లపు వీరాస్వామి గొరిజవోలుకు తీసుకొచ్చి నివాసం ఏర్పాటు చేశాడు.

 ఈ నెల 18న తన కుమారుడు యశ్వంత్‌కుమార్‌ పుట్టినరోజు కావటంతో ఆమె కేక్ తీసుకురావడానికి బయటకు వెళ్లింది. తిరిగి వచ్చే సమయానికి కొడుకు కనిపించలేదు. దీంతో.. వెంటనే ఆమె చుట్టుపక్కల గాలించింది. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. లక్ష్మి సమీప బంధువైన వీరస్వామి.. బాలుడిని  బైక్ పై ఎక్కించుకు తీసుకువెళ్లాడు. అలా తీసుకువెళ్లడాన్ని లక్ష్మి కుమార్తె జ్యోతి చూసింది. దీంతో.. ఆమె అదే విషయాన్ని తల్లికి తెలియజేసింది.

కాగా.. ఆమె అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. ఓ గోనెసంచిలో బాలుడి శవం కనిపించడంతో.. అందరూ షాక్ అయ్యారు. కాగా.. వీరాస్వామి బాలుడిని చంపినట్లు  అనుమానిస్తున్నారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.