Asianet News TeluguAsianet News Telugu

చచ్చిపోతున్నావ్ కదా.. ఏటీఎం పిన్ నంబర్ చెప్పు.. స్నేహితుడి గొంతు కోసి...

డబ్బు కోసం అతి కిరాతకంగా స్నేహితుని ప్రాణం తీశాడో దుర్మార్గుడు. డబ్బు ఇవ్వలేదన్న కోపంతో కసితీరా గొంతు కోసి మరీ చంపాడు. కొనఊపిరితో విలవిలలాడుతున్న స్నేహితున్ని ఎలాగూ చస్తావ్.. ఇప్పుడైనా నీ ఏటీఎం పిన్ నంబర్ చెప్పు.. అంటూ బతిమాలాడు. ప్రాణం పోతున్నా.. అతను నిరాకరించడంతో మరో సారి గొంతుకోసి చంపేశాడు. బాపట్ల శివార్లలో జరిగిన ఈ హత్య కలకలం రేపింది. 
 

man brutally assassinated his friend in bapatla - bsb
Author
Hyderabad, First Published Jan 29, 2021, 10:11 AM IST

డబ్బు కోసం అతి కిరాతకంగా స్నేహితుని ప్రాణం తీశాడో దుర్మార్గుడు. డబ్బు ఇవ్వలేదన్న కోపంతో కసితీరా గొంతు కోసి మరీ చంపాడు. కొనఊపిరితో విలవిలలాడుతున్న స్నేహితున్ని ఎలాగూ చస్తావ్.. ఇప్పుడైనా నీ ఏటీఎం పిన్ నంబర్ చెప్పు.. అంటూ బతిమాలాడు. ప్రాణం పోతున్నా.. అతను నిరాకరించడంతో మరో సారి గొంతుకోసి చంపేశాడు. బాపట్ల శివార్లలో జరిగిన ఈ హత్య కలకలం రేపింది. 

రైల్వే ట్రాక్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఓ ఇంజనీర్ ఐదురోజుల క్రితం అదృశ్యమయ్యాడు.  శవంగా దొరికాడు. దీంతో అదే ఆఫీసులో పనిచేస్తున్న అతని స్నేహితునిపై అనుమానంతో పోలీసులు అన్ని విచారించాడు. షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 

వివరాల్లోకి వెడితే.. విజయవాడ-చెన్నై మూడో రైల్వే లైన్ నిర్మాణ ప్రాజెక్టు పనులు జీఆర్ ఇన్ ఫ్రా సంస్థ చేస్తోంది. దీనికోసం బాపట్ల శివార్లలోని కేబీపాలెం రైల్వేగేటు దగ్గర్లో ఆ సంస్థ క్యాంపు ఏర్పాటు చేసింది. ఇందులో 150 మందికి పైగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజినీర్లు, కార్మికులు పనిచేస్తున్నారు. 

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బిలాయికి చెందిన యువరాజ్ విశ్వకర్మ(34) ఇక్కడ బాపట్ల-పొన్నూరు ప్రాంతంలో రైల్వేట్రాక్ పనుల ఇంజనీర్ గా జీఆర్ ఇన్ ఫ్రాలో గత రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. పశ్చిమ బంగ రాష్ట్రం ముర్షీదాబాద్ డివిజన్ మహిషాస్థలి దగ్గర్లోని పటామరి గ్రామానికి చెందిన అమర్ జీత్ మండల్ కూడా ఇదే సంస్థలో పంప్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఈ మధ్యే అసిస్టెంట్ మేనేజర్ అయ్యాడు. 

క్యాంపు ఆఫీస్ నుంచి 23 సాయంత్రం ఇద్దరు కలిసి టూ వీలర్ మీద పొన్నూరు వెళ్లి పనులు పరిశీలించారు. తిరిగి వస్తూ మధ్యలో భర్తిపూడి మద్యం షాపు దగ్గర మద్యం కొని తాగారు. నల్లమడవాగు ఆర్అండ్ బీ వంతెన కిందకు విశ్వకర్మను తీసుకువచ్చిన మండల్ డబ్బులు ఇవ్వాలంటూ గొడవకు దిగాడు. దీనికి యువరాజ్ ఒప్పుకోలేదు. దీంతో కోపం వచ్చిన మండల్ తన దగ్గరున్న కత్తితో యువరాజ్ గొంతు కోశాడు. 

అతని పర్సులో నుంచి బ్యాంకు ఏటీఎం కార్డు తీసుకున్నాడు. అప్పటికే కొన ఊపిరితో కొట్టుకుంటున్న యువరాజ్ ను పిన్ నెంబర్ చెప్పాలని మండల్ ఒత్తిడి చేశాడు. యువరాజ్ చెప్పకపోవడంతో కత్తితో మళ్లీ గొంతుకోసి హత్య చేశాడు. ఆ తరువాత వంతెన కింద తవ్వి పాతిపెట్టాడు.

యువరాజ్  దగ్గరున్న రెండు సెల్ ఫోన్లను ఒకదాన్ని అక్కడే తవ్వి పాతిపెట్టి, మరోదాన్ని నీళ్లలో పడేశాడు. టూవీలర్ ను పొన్నూరు రైల్వే వంతెన దగ్గర వదిలిపెట్టి ఏమీ తెలీనట్టుగా క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నాడు. యువరాజ్ కనిపించకపోవడంపై జీఆర్ ఇన్ ఫ్రా అధికారి షాజహాన్ 24న బాపట్ల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సీసీ టీవీ ఫుటేజ్ నిందితుడిని పట్టించింది. దీంతో మండల్ ను గట్టిగా తమదైన శైలిలో ప్రశ్నించగా విషయం బయటపడింది. నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. నల్లమడ వాగు వంతెన దగ్గర మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలంలో పోలీసులు తవ్వించి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మండల్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios