గుంటూరులో సంచలనం కలిగించిన ఇంజనీరింగ్ విద్యార్ధిని మార్ఫింగ్ వీడియోల వ్యవహరం మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది. రఘునాథ్ అనే వ్యక్తి ఓ యువతి ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో మార్ఫింగ్ ఫోటోలతో యువతిని బెదిరించాడు. న్యూడ్ ఫోటోలు పంపకపోతే.. మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. రఘుబాబు ఇదే తరహాలో పది మంది మహిళలను బెదిరించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

తొమ్మిది నెలలుగా మార్ఫింగ్ ఫోటోలతో మహిళలను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో అతని వేధింపులు భరించలేకపోయిన ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు రఘుబాబును అరెస్ట్ చేశారు.

తొలుత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి.. ఆ తర్వాత వారి ఫోటోలను డౌన్‌లోడ్ చేసుకునేవాడు. వాటిని మార్ఫింగ్ చేసి ఆ ఫోటోల సాయంతో బెదిరింపులకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు.