హైదరాబాద్: తనకేమైనా జరిగితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ దే బాధ్యత అని సినీ క్రిటిక్ మహేష్ కత్తి అన్నారు. కొద్ది కాలం మౌనం వహించిన మహేష్ కత్తి ఇటీవలి కాలంలో మళ్లీ పవన్ కల్యాణ్ పై, ఆయన అభిమానులపై దుమ్మెత్తిపోయడం ప్రారంభించారు. 

తన భద్రత బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో వీడియోను పోస్టు చేశారు. తిడుతూ బెదిరిస్తూ ఆన్ లైన్ ట్రోలింగ్ చేస్తన్న తన అభిమానులను నియంత్రించాల్సిన బాధ్యత పవన్ దేనని ఆయన అన్నారు. 

పవన్ కల్యాణ్ గారూ... టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ అని కోరారు. బూతులు తిట్టడం, బెదిరించడం, ఆన్ లైన్ ట్రోలింగ్ చేయడం, ఫోన్ నెంబర్ దొరికితే కాల్ చేసి పరమ చండాలంగా మాట్లాడడం.. ఇవీ పవన్ కల్యాణ్ అభిమానులకు ఉన్న అతి పెద్ద బలాలని ఆయన అన్నారు. 

వాళ్లు మళ్లీ అదే మొదలుపెట్టారని,  తన ఫోన్ నెంబర్ ను బయటపెట్టారని, తన చిరునామాను పబ్లిక్ డొమైన్ లో పెట్టి తమలో తాము రెచ్చగొట్టుకునేలా మాట్లాడుకుని తన మీద దాడి చేయాలని ప్లాన్ చేయడం, తనకు ఫోన్ చేసి బెదిరించడం చేస్తున్నారని, ఇది అసహ్యంగా ఉందని ఆయన అన్నారు. 

అదంతా భరించలేకుండా ఉదని, తనకు ఏదైనా జరిగితే పవన్ కల్యాణ్ దే బాధ్యత అని, ఇది తాను భయపడి చెప్పడం లేదని, సమాజాంలో ఇలాంటి అరాచాకానికి కారణమైన వాళ్లు దాన్ని బాధ్యతగా తీసుకోకపోవడం కూడా సమస్యేని ఆయన అన్నారు.