జయేంద్ర సరస్వతి మహాసమాధి

జయేంద్ర సరస్వతి మహాసమాధి

కంచి కామకోటి 69వ పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతి మహాసమాధిలోకి వెళిపోయారు. కంచిమఠంలో ఆవరణలోనే ఉన్న బృందావనంలో గురువారం ఉదయం సుమారు 9.50 గంటల ప్రాంతంలో జయేంద్ర సరస్వతి మహాసమాధిలోకి వెళ్ళిపోయారు. పరమాచార్య చంద్రశేఖర సరస్వతి మహాసమాధి పక్కనే జయేంద్ర సరస్వతి మహాసమాధికి మఠం నిర్వాహకులు అన్నీ ఏర్పాట్లు చేశారు. స్వామివారికి కడసారి వీడ్కోలు పలకటానికి దేశ, విదేశాల్లోని పలువురు ప్రముఖులు మఠానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం జయేంద్ర శివైక్యం చెందారని తెలియగానే వివిఐపిలు, భక్తుల రాకతో మఠం క్రిక్కిరిసిపోయింది.

జయేంద్ర మహాసమాధిలోకి వెళ్ళేముందు కంచిపీఠంలోని స్వాములు శాస్త్రోక్తంగా మహాభిషేకం నిర్వహించారు. దేశంలోని సమస్త నదీ జలాలను తెప్పించి మరీ అభిషేకం నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటుమహాభిషేకం క్రతువు జరిగింది. ఈ క్రతువు మొత్తాన్ని ఉత్తర పీఠాధిపతి విజయేంద్రసరస్వతి తన చేతుల మీదుగా నిర్వహించారు. మహాభిషేకం కార్యక్రమంలో దేశంలోని ప్రముఖ మఠాధిపతులందరూ పాల్గొన్నారు.

                                                                     మహాసమాధి

బృందావనంలో ఏర్పాటు చేసిన మహాసమాధికి మఠం నిర్వాహకులు సుమారు 10 అడుగుల లోతు, 13 అడుగుల వెడల్పుతో పెద్ద గొయ్యి తవ్వారు. జయేంద్ర సరస్వతిని కూర్చోబెట్టిన కుర్చీతో సహా గొయ్యిలోకి దింపారు. కుర్చీ చుట్టుపక్కల గంధం, చందనం లాంటి చెక్కలతో పాటు పూలదండలు, పవిత్ర జాలతతో నింపేసారు. కపాలమోక్షం కలిగించటంలో భాగంగా ఉత్తర పీఠాధిపతి, శిష్యులు జయేంద్ర సరస్వతి తలపై కొబ్బరికాయలు కొట్టారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos