ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ‘మహానటి’ చిత్ర యూనిట్ ను సన్మానించారు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ‘మహానటి’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అఖండ
విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు చిత్ర యూనిట్ ను అభినందించారు. 

తన మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా మహానటి సినిమా చూడాల్సిందిగా ప్రమోట్ చేసినట్లు చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం చిత్ర నిర్మాతలు వైజయంతి సంస్థ తరఫున
 రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. 

ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ ఈ సినిమా సూపర్ హిట్టయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. మరీ ముఖ్యంగా సావిత్ర పాత్ర పోషించడం గొప్పతనమని, ఈ పాత్రతో  తనకు మంచి గుర్తింపు ఇచ్చిన చిత్ర యూనిట్‌కు, అభిమానులకు కీర్తి సురేష్ అభినందనలు తెలిపారు. మహానటి సావిత్రి పుట్టన ఊరు గుంటూరని, ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం గొప్పతనమని  చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్‌, చిత్ర నిర్మాతలు, డైరెక్టర్‌తో పాటు పలువురు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.