Asianet News TeluguAsianet News Telugu

మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య: ఎట్టకేలకు రుయా ఆస్పత్రికి భార్యాభర్తలు

క్షుద్రపూజలతో కూతుళ్లను చంపేసిన దంపతులు పద్మజ, పురుషోత్తంనాయుడులను ఎట్టకేలకు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మీడియా కంట పడకుండా వారిని ఆస్పత్రికి తరలించారు.

Madanapalle sisters killing: Padmaja couple shifted to Tirupathi hospital
Author
Madanapalle, First Published Jan 29, 2021, 8:21 AM IST

చిత్తూరు: కూతుళ్లను క్షుద్రపూజలు చేసి మట్టుబెట్టిన తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంనాయుడులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కూతుళ్లు అలేఖ్య, సాయి దివ్యలను క్షుద్రపూజలు చేసి చంపిన పురుషోత్తం నాయుడు, పద్మజలను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించాలని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మానసిక వైద్యురాలు రాధిక నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. దీంతో జైలు అధికారులు కోర్టును ఆశ్రయించారు. 

వారిని ఆస్పత్రికి తరలించడానికి జైలు వద్దకు వచ్చిన పోలీసులు కోర్టు ఆదేశాలు రాకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. అయితే శుక్రవారం ఉదయం వారిద్దరిని రుయా ఆస్పత్రికి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. మీడియా కంట పడుకుండా వారిని ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల పాటు తర్జనభర్జనలు పడిన తర్వాత తాలూకా పోలీసులు శుక్రవారం వారిని తరలించేందుకు ఎస్కార్ట్ ఇచ్చారు. దీంతో వారిద్దరిని ప్రత్యేక వాహనంలో ఆస్పత్రికి తరలించారు. 

Also Read: మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య: పరాకాష్టకు చేరిన అలేఖ్య ఉన్మాద భక్తి

ఇదిలావుంటే, కూతుళ్లను హత్య చేసిన కేసులో నిందితురాలైన పద్మజ బుధవారం రాత్రంతా శివనామస్మరణతో గడిపినట్లు తెలుస్తోంది. అందరితో కలిపి తననూ మహిళా బ్యారక్ లోనే ఉంచాలని పద్మజ చిత్తూరు జిల్లా మదనపల్లె స్పెషల్ సబ్ జైలు అధికారులను కోరినట్లు సమాచారం. దీంతో ఆమెను ఇతర మహిళా నిందితులతో కలిపి ఉంచినట్లు తెలుస్తోంది. 

మిగతా నిందితులతో పాటు ఆమె కలిసి బుధవారం రాత్రి భోజనం చేసినట్లు చేసినట్లు సమాచారం. గురువారం సాయంత్రం మాత్రం ప్రత్యేక బ్యారక్ కు మార్చి అదనపు సిబ్బందిని నియమించారు. పద్మజ భర్త పురుషోత్తంనాయుడు ప్రవర్తన సాధారాణగానే ఉందని తెలుస్తోంది. 

Also Read: వాళ్లకు తాయెత్తులు కట్టాను, ఓ వ్యక్తి శంఖం ఊదాడు: మదనపల్లి అక్కాచెల్లెళ్ల మర్డర్స్‌పై భూత వైద్యుడు

అక్కాచెల్లెళ్ల హత్య జరగడానికి ముందు రోజు ఉదయం శివనగర్ లోని ఇంటికి వచ్చిన మాంత్రికుడు సుబ్బరామయ్యను పోలీసులు విచారిస్తున్నారు. పురుషోత్తంనాయుడి ఇంటికి వచ్చినప్పుడు తాను చూసిన పరిస్థితులను అతను పోలీసులకు వివరిచాడు.

తాను ఈ నెల 23వ తేదీన పురుషోత్తంనాయుడి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ 40-50 ఏళ్ల వయస్సు గల ఓ బక్కపలచటి మనిషి ఉన్నాడని, స్పృహలో లేని అలేఖ్య చెవిలో అతను శంఖం ఊదుతున్నాడని మాంత్రికుడు చెప్పిన విషయం తెలిసిందే. హత్యలు జరిగిన తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లిన వ్యక్తుల వాంగ్మూలాలు కూడా పోలీసులు రికార్డు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios