చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులు హత్య చేసిన కేసులో రోజుకో కీలక విషయం వెలుగు చూస్తోంది. మృతులకు తాయెత్తు కట్టిన భూత వైద్యుడిని కూడ పోలీసులు విచారించారు. ఈ  కేసులో  భూత వైద్యుడు కీలక విషయాలను వెల్లడించారు.

కూతుళ్లు సాయిదివ్య, అలేఖ్యలను తల్లిదండ్రులు  పురుషోత్తంనాయుడు, పద్మజలు దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో భూత వైద్యుడిని కూడ పోలీసులు విచారించారు. 

అనారోగ్యానికి గురైన చిన్న కూతురికి తాయెత్తు కట్టేందుకు స్థానిక భూత వైద్యుడిని పురుషోత్తంనాయుడు దంపతులు సంప్రదించారు. భూత వైద్యుడు ఈ నెల 23న అనారోగ్యానికి గురైన చిన్న కూతురు సాయి దివ్యతో పాటు పెద్ద కూతురు అలేఖ్యకు కూడ తాయెత్తు కట్టినట్టుగా ఆయన చెప్పారు.. ఆ సమయంలో పిల్లలిద్దరూ కూడ యాక్టివ్ గానే ఉన్నారన్నారు.

also read:జైలు గదిలో శివుడినంటూ పద్మజ కేకలు: దంపతులను తిరుపతి స్విమ్స్ కి తరలించే ఛాన్స్

తాయెత్తు కట్టేందుకు తాను పురుషోత్తంనాయుడి ఇంటికి వెళ్లిన సమయంలో  పురుషోత్తంనాయుడి దంపతులతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడ ఇంట్లోనే ఉన్నారని చెప్పారు. 

పురుషోత్తంనాయుడి ఇంట్లో ఓ వ్యక్తి తాను ఉన్నంత సేపు శంఖం ఊదుతూనే ఉన్నాడని చెప్పారు. ఈ సమయంలో పురుషోత్తంనాయుడు పెద్ద కూతురు అలేఖ్య  ఇంగ్లీష్ లో ఏదో మాట్లాడుతూ కన్పించిందని ఆయన చెప్పారు.

పద్మజ, పురుషోత్తంలు కూడ మామూలుగానే ఉన్నారని ఆయన గుర్తు చేసుకొన్నారు.