చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించిన కూతుళ్ల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన మొత్తానికి పెద్దమ్మాయి అలేఖ్యే కారణమని తెలుస్తోంది.

రెండు వారాల క్రితం పెంపుడు కుక్కతో బయటకు వెళ్లింది సాయి దివ్య. అయితే బయట ఏదో ముగ్గు తొక్కినట్లు దివ్య అనుమానించింది. ఆ తర్వాతి రోజు నుంచి దివ్య అనారోగ్యానికి గురైంది.

అంతేకాకుండా ఆరోజు నుంచి చనిపోతాననన్న భయంలోనే ఆమె వుండిపోయింది. అయితే దివ్య చనిపోవడానికి అలేఖ్య సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 23న భూత వైద్యుడితో తాయెత్తులు కట్టించారు తల్లిదండ్రులు.

ఈ క్రమంలోనే 24న ఏడుస్తూ ఇంటి మేడపైకి వెళ్లింది దివ్య. 24 మధ్యాహ్నం ఒంటిగంటకు వేపాకులతో దివ్యను తల్లిదండ్రులు కొట్టారు. అదే రోజు రాత్రి తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంలు డంబెల్స్‌తో ఆమె తలపై మోదీ చంపారు.

Also Read:మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో చిక్కుముడులు ఇవే..

దివ్య హత్య తర్వాత తననూ చంపాలని అలేఖ్య తల్లిదండ్రులను కోరింది. దీనిలో భాగంగా రూమ్‌లోకి వెళ్లి పూజ గదిలో గుండు కొట్టుకుంది అలేఖ్య. నోటిలో రాగి చెంబు పెట్టుకుని పూజగదిలో కూర్చొంది.

అనంతరం అలేఖ్యను డంబెల్స్‌తో కొట్టి చంపారు తల్లిదండ్రులు. చెల్లిని తల్లిదండ్రులతో కలిసి చంపింది అలేఖ్య. చనిపోయిన చెల్లిని తీసుకువస్తానని తల్లిదండ్రుల చేతిలో అలేఖ్య చనిపోయింది. పునర్జన్మలపై విశ్వాసమే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

కాగా, bదనపల్లి జంట హత్యల కేసులో తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులుగా చేర్చిన తల్లిదండ్రులిద్దరినీ పోలీసులు మంగళవారం రెండో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు వద్ద హాజరు పరిచారు. విచారణ అనంతరం నిందితులకు మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో వారిని సబ్‌ జైలుకు తరలించారు.