Asianet News TeluguAsianet News Telugu

జనసేనలో చేరిన వైసీపీ ఎంపీ బాలశౌరీ .. పారిపోవడానికి ‘‘ సిద్ధమా ’’ అంటూ జగన్‌పై సెటైర్లు

టీడీపీ, జనసేన ప్రభుత్వంలో చేయాల్సిన పనులు చాలా వున్నాయన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ. సిద్ధం పేరుతో సభలు పెడుతున్నారు .. దేనికి సిద్ధం పారిపోవడానికి సిద్ధమా అంటూ సెటైర్లు వేశారు . జనసైనికులు సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని వేటాడతారని వల్లభనేని బాలశౌరీ హెచ్చరించారు.

machilipatnam mp vallabhaneni balasouri join in janasena ksp
Author
First Published Feb 4, 2024, 7:46 PM IST

టీడీపీ, జనసేన ప్రభుత్వంలో చేయాల్సిన పనులు చాలా వున్నాయన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీ. ఆదివారం ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం బాలశౌరీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఎవరూ రావడం లేదంటూ దుయ్యబట్టారు. తాను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు అని సీఎం జగన్ చెప్పడం పెద్ద అబద్ధమన్నారు. ఆశించిన స్థాయిలో ఏపీలో అభివృద్ధి జరగలేదని అందుకే తాను వైసీపీని వీడానని బాలశౌరీ వివరించారు. 

బ్రహ్మాండమైన రాజధాని కట్టండి అని జగన్ చెప్పలేదా.. అమరావతిలో రాజధాని కట్టాలని పాదయాత్ర సమయంలో చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. సిద్ధం పేరుతో సభలు పెడుతున్నారు.. దేనికి సిద్ధం ..పారిపోవడానికి సిద్ధమా అంటూ సెటైర్లు వేశారు. జనసైనికులు సింహంలా గర్జిస్తూ మిమ్మల్ని వేటాడతారని వల్లభనేని బాలశౌరీ హెచ్చరించారు. తనకు దేవుడున్నాడని సీఎం జగన్ చెబుతున్నారని, మీకేమైనా దేవుడు వకాల్తా ఇచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. 

ఈరోజు నుంచి నేను జనసేన కార్యకర్తనని.. పవన్ కళ్యాణ్ ఏ పదవి ఇచ్చినా పని చేస్తానని వల్లభనేని తెలిపారు. పార్టీ నడపటమంటే ఆషామాషీ కాదని, సినిమాల్లో వచ్చే రెమ్యూనరేషన్‌తో పవన్ పార్టీ నడుపుతున్నారని ప్రశంసించారు. ఇక నుంచి పవన్‌తోనే తన రాజకీయ జీవితం కొనసాగుతుందని, పార్టీని అభివృద్ధి చేసుకోవడంలో అందరం పవన్‌కు అండగా వుండాలని వల్లభనేని బాలశౌరీ సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios