అందుకే జనసేనలో చేరుతున్నా.. వైసీపికి షాకిచ్చిన మచిలిపట్నం ఎంపీ..
Vallabhaneni Balashowry: ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయం రసవత్తంగా మారుతోంది. వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో మచిలి పట్నం నుంచి గెలుపొందిన వైసీపీ ఎంపీకి జగన్ మొండి చేయి చూపించారు. ఆ ఎంపీ అనుచరులు, అభిమానులతో చర్చించాక జనసేనలో బాలశౌరి నిర్ణయించారు. ఇంతకీ ఆ ఏపీ ఎవరు? ఆ కథేంటో తెలుసుకుందాం .
Vallabhaneni Balashowry: మరికొద్ది రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయం రసవత్తంగా మారుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహలు రచిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు మార్పులు చేస్తూ వైసీపీ ఆరు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే.. పార్టీలో ఇంఛార్జ్ ల మార్పు వేళ సీట్లు దక్కని కొందరు నేతలు పార్టీ వీడుతున్నారు. ఇదే సమయంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా వైసీపీ వీడుతున్నారని ప్రచారం మొదలైంది. ప్రచారంపై ఎంపీ వల్లభనేని బాలశౌరినే నేరుగా స్పందించారు.
తాను జనసేనలో చేరుతున్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రకటించారు. పవన్ కల్యాణ్ సమక్షంలో తాను ఆదివారం (ఫిబ్రవరి 4) జనసేనలో చేరనున్నట్లు ఆయన వెల్లడించారు. తాను 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని, వైఎస్ కుటుంబం కోసం..వారి పార్టీ కోసం ఎంతో క్రుషి చేశానని అన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బందర్ నుండి పోటీ చేసి గెలుపొందననీ, బందర్ పోర్టు నుండి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. కేంద్ర నిధులు సీఎస్ ఆర్ ఫండ్స్ తీసుకొచ్చామని, పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గత ఐదేళ్లలో అనుకున్నంతగా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే పోలవరం, స్టీల్ ప్లాంట్ అంశాలపై జనసేనాని పవన్ కల్యాణ్ తో చర్చించాననీ, ఈ అంశాలపై జనసేనానితో అయినా తర్వతనే తాను ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నానని అన్నారు. రాష్ట్రాన్ని పవన్ కల్యాణ్ అభివృద్ది చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. తనతో పాటు చాలామంది జనసేనలో జాయిన్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నారని కీలక ప్రకటన చేశారు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా పని చేస్తామన్నారు. తాను ఎక్కడి నుండి పోటీ చేయాలన్నది పవన్ నిర్ణయిస్తారని బాలశౌరి వెల్లడించారు.పవన్ కల్యాణ్ పై నాకు నమ్మకం ఉందన్నారు.
గత ఎన్నికల్లో వల్లభనేని బాలశౌరి వైసీపీ ఎంపీగా మచిలీపట్నం నుంచి గెలిచారు. అయితే, ఈసారి ఎన్నికల్లో ఆయనకు జగన్ మొండి చేయి చూపించారు. టికెట్ ఇచ్చేది లేదని తేల్చేశారు. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసేశారు. తన అనుచరులు, అభిమానులతో చర్చించాక జనసేనలో చేరాలని బాలశౌరి నిర్ణయించారు. బాలశౌరి జనసేనలో చేరనున్నట్లు కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన అధికారిక ప్రకటన చేశారు.