బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే మూడు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమరావతి ఐఎండీ తెలిపింది. 

వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడింది. ఇది సోమవారం సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తుకు విస్తరించింది. అల్పపీడనం వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతూ రానున్న 24 గంటల్లో మరింతగా మారే అవకాశం ఉందని అమరావతి ఐఎండీ నివేదిక తెలిపింది. రానున్న మూడు రోజుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

మహిళలపై దాడులపై ఉదాసీనత: జగన్ పై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్

ఈ అల్ప పీడ‌న ప్ర‌భావంతో తూర్పు గోదావరి, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలు, యానాంలోని ఏకాంత ప్రదేశాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప‌లు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, దక్షిణ కోస్తా ఆంధ్ర లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మూడు రోజుల పాటు వాన‌లు ప‌డే అవ‌కాశం ఉంది. 

వెనుకబడిన ప్రాంతాల కేటాయింపులపై శ్వేత పత్రం: బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్

అదే సమయంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా గంట‌కు 45-55 కిలో మీట‌ర్ల నుంచి 65 కిలో మీట‌ర్ల వేగంతో గాలులు వీచే అవ‌కాశం ఉంది. కాగా.. సోమ‌వారం వరరామచంద్రాపూర్ (తూర్పుగోదావరి)లో 13 సెంటీ మీర్లు, ఏలూరు (పశ్చిమగోదావరి) 11 సెంటీ మీట‌ర్లు, కూనవరం (తూర్పుగోదావరి) 5 సెంటీమీట‌ర్లు, పార్వతీపురం (విజయనగరం) 5 సెంటీ మీట‌ర్లు, వేలైర్లపాడులో 5 సెంటీ మీట‌ర్ల వ‌ర్షం ప‌డింది. నెల్లిమర్ల (విజయనగరం) 5 సెంటీ మీట‌ర్లు, ఎస్ కోట (విజయనగరం) 5 సెంటీ మీట‌ర్ల వ‌ర్షం కురిసింది.