కుర్రాడితో ఎఫైర్: ఆమెకు 30, అతడికి 16 ఏళ్లు, పారిపోయిన జంట

lovers escapes in prakasham district
Highlights

ఆమెకు 30... అతడికి పదహరేళ్లు వీరిదదరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.  దీంతో  ఆ పదహరేళ్ల కుర్రాడితో ఆ వివాహిత పారిపోయింది.  ఆ కుర్రాడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఒంగోలులో చోటు చేసుకొంది.

 ఒంగోలు: ఆమెకు 30... అతడికి పదహరేళ్లు వీరిదదరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.  దీంతో  ఆ పదహరేళ్ల కుర్రాడితో ఆ వివాహిత పారిపోయింది.  ఆ కుర్రాడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఒంగోలులో చోటు చేసుకొంది.

ఒంగోలు పట్టణంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల యువకుడు తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. ఆ  యువకుడు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే ఓ వివాహిత భర్త, పిల్లలతో కలిసి ఉంటుంది.

ఆ వివాహితకు ఇంటర్ విద్యార్ధికి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.  ఈ విషయం తెలియడంతో భార్యపై భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయమై భార్య,భర్తల మధ్య గొడవ జరిగింది.  ఈ గొడవ కారణంగా తాను పుట్టింటికి వెళ్లిపోతున్నట్టు ఆమె ఇంటి నుండి వెళ్లిపోయింది. 

అయితే అదే రోజు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఆ కుర్రాడు కూడ  ఇంటికి రాలేదు.  ఆ కుర్రాడి సెల్‌ఫోన్‌ కూడ స్విచ్చాఫ్ చేసి ఉంది.  అతని స్నేహితులను విచారించినా కూడ ప్రయోజనం లేకుండా పోయింది. అతడి కోసం గాలించినా కూడ ఆచూకీ దొరకలేదు.

దీంతో కుర్రాడి కుటుంబసభ్యులు ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ వార్త చదవండి: వివాహేతర సంబంధం: ఎఫైర్ వద్దన్న ప్రియుడికి షాకిచ్చిన లవర్

 

loader