వివాహేతర సంబంధం: ఎఫైర్ వద్దన్న ప్రియుడికి షాకిచ్చిన లవర్

Ratnamma arrested for killing four years boy in Nellore district
Highlights

నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించకుండా దూరంగా ఉంచుతున్నాడనే నెపంతో  ప్రియుడి  నాలుగేళ్ల కొడుకును  అతి కిరాతకంగా  చంపేసింది  ఆ నిందితురాలు.  

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించకుండా దూరంగా ఉంచుతున్నాడనే నెపంతో  ప్రియుడి  నాలుగేళ్ల కొడుకును  అతి కిరాతకంగా  చంపేసింది  ఆ నిందితురాలు.  అంతేకాకుండా  మృతదేహం  దొరకకుండా ఉండేందుకుగాను  గోనెసంచిలో  దాచిపెట్టింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు  గాలింపు చర్యలు చేపట్టడంతో ప్రియురాలు రత్నమ్మ ఇంట్లో నాలుగేళ్ల బాలుడి  మృతదేహం లభ్యమైంది.

నెల్లూరు జిల్లాలోని బాలాజీరావుపేటలో  శ్రీనివాస్ కు, రత్నమ్మకు మధ్య వివాహేతర సంబంధం  ఉంది. ఈ విషయమై  శ్రీనివాస్  భార్యతో పాటు కుటుంబసభ్యులకు తెలిసింది. అయితే దీంతో శ్రీనివాస్  రత్నమ్మను దూరం పెట్టారు.  దీంతో రత్నమ్మ శ్రీనివాస్‌పై కక్ష పెట్టుకొంది.

శ్రీనివాస్‌‌కు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. శ్రీనివాస్‌పై కక్ష తీర్చుకొనేందుకు గాను  నాలుగేళ్ల కొడుకు కుటుంబసభ్యులకు తెలియకుండా  తన ఇంటికి తీసుకెళ్లింది.తన ఇంట్లోనే శ్రీనివాస్ కొడుకు  గొంతు నులిమి చంపేసింది.  

మృతదేహన్ని  తన ఇంట్లోని గోనెసంచిలో దాచిపెట్టింది. తన కొడుకు ఆచూకీ కోసం  శ్రీనివాస్‌తో పాటు కుటుంబసభ్యులు గ్రామమంతా వెతికారు. కానీ, ఆచూకీ లభ్యం కాలేదు. 

ఈ తరుణంలో అనుమానంతో రత్నమ్మ ఇంట్లో పోలీసుల సహాయంతో  గాలింపు చర్యలు చేపట్టారు.రత్నమ్మ ఇంట్లో  గోనెసంచిలో శ్రీనివాస్ నాలుగేళ్ల కొడుకు మృతదేహం లభ్యమైంది. బాధితుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు  పోలీసులు రత్నమ్మను అరెస్ట్ చేశారు.  

loader