ఒంగోలు: 13 ఏళ్లపాటు వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన ప్రియురాలు చివరికి ప్లాన్ ప్రకారంగా ప్రియుడిని వెంటాడి మరీ హత్య చేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది. అయితే  ఈ ఘటనకు సంబంధించిన నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన ఆమె సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గత నెల 29వ తేదీన బాల చంద్రశేఖర్‌రావును ప్రియురాలు కరీమూన్ హత్య చేసింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలను  డిఎస్పీ వి.శ్రీనివాసరావు వివరించారు. ఆదివారం నాడు  వేటపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ప్రకాశం జిల్లా దేశాయిపేట పంచాయితీ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన పింజల బాలచంద్రశేఖర్‌రావుకు  13 ఏళ్ల నుండి కరీమూన్‌తో వివాహేతర సంబంధం ఉందని డిఎస్పీ చెప్పారు.

 నాలుగేళ్లుగా చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే జూన్ 26వ తేదీన తన తండ్రి సంవత్సరీకాన్ని పురస్కరించుకొని శాంతినగర్‌లోని తన సోదరుడి ఇంటి వచ్చాడు. అదే రోజు రాత్రి ప్రియురాలిని కలిశాడు.

అయితే మరునాడు ఉదయమే చంద్రశేఖర్ వద్దకు వచ్చిన ప్రియురాలు తన ఇంటికి రావొద్దని హెచ్చరించింది. ఒకవేళ వస్తే చంపేస్తానని తెగేసి చెప్పింది.దీంతో చంద్రశేఖర్‌రావు షాక్ కు గురయ్యాడు. వివాహేతర సంబంధం వద్దని ప్రియురాలు కోరింది. అయితే చంద్రశేఖర్ వినలేదు. ఇదే విషయమై చంద్రశేఖర్ సోదరుడికి కూడ ఈ విషయాన్ని చెప్పింది. అయితే సోదరుడు చంద్రశేఖర్ కు నచ్చజెప్పాడు.  అయితే  చంద్రశేఖర్‌ తన ఇంటికి వస్తే చంపాలని ప్రియురాలు ప్లాన్ చేసుకొంది.ఈ విషయమై తన సోదరుడి సహాయం తీసుకొంది.

ఊహించినట్టుగానే జూన 29వ తేదీ రాత్రి చంద్రశేఖర్ రావు  కరీమూన్‌ ఇంటికి వెళ్లాడు. చంద్రశేఖర్‌రావు ఇంట్లోకి ప్రవేశించగానే ప్రియురాలు రాడ్‌తో గట్టిగా కొట్టింది. దీంతో  భయంతో చంద్రశేఖర్‌రావు పరుగెత్తాడు... తన సోదరుడితో పాటు తాను కూడ వెంటాడి చంద్రశేఖర్‌రావును ప్రియురాలు కొట్టి చంపేసింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్టు ఆయన చెప్పారు.