Asianet News TeluguAsianet News Telugu

లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య.. పెళ్లి చేసుకుని, బాత్రూం కిటికీకి ఉరేసుకుని..

విశాఖపట్నంలోని ఓ లాడ్జిలో ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. ఒకే కులానికి చెందిన వీరు.. ప్రేమించి, పెళ్లి చేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. 

Love couple commits suicide in lodge In Visakhapatnam
Author
First Published Oct 19, 2022, 1:29 PM IST

విశాఖపట్నం : వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలకలాం కలిసి జీవించాలనుకున్నారు. ఇంతలో ఏమయ్యిందో.. ఏం కష్టం వచ్చిందో తెలియదు.. లాడ్జీలో విగతజీవులుగా మారారు. గదిలోని కిటికీకి ఉరేసుకుని తనువు చాలించారు. అయితే, ఆత్మహత్యకు ముందు వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు యువతి మెడలోని తాళి ఆధారంగా పోలీసులు గుర్తించారు. కాగా, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన ఇన్ ఛార్జి సీఐ, మహారాణిపేట సీఐ జి. సోమశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం, దూసి గ్రామానికి చెందిన దామోదర్, ఆముదాలవలస మండలం బలగాం గ్రామానికి చెందిన సంతోషి కుమారి (18) సోమవారం గొల్లలపాలెందరి అయ్యన్ ప్రెసిడెన్సీలో గది అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి వారు హోటల్ గది నుంచి బయటికి  రాలేదు. మంగళవారం వారి బంధువు లాడ్జికి వచ్చి వారిఫోటో చూపించి ఏ గదిలో ఉన్నారో తెలుసుకున్నారు. రూమ్ దగ్గరికి వెళ్లి పిలిచినా.. తలుపు తట్టినా లోపలి నుంచి ప్రతిస్పందన రాలేదు. 

దాదాపు గంట పాటు వేచి చూసిన తర్వాత వారు లాడ్జి సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే లాడ్జి సిబ్బంది తలుపులు తెరచి చూసేటప్పటికీ బాత్రూం కిటికీకి తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించారు. దీంతో లాడ్జి సిబ్బంది టూటౌన్ పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ  సోమశేఖర్ ఆదేశాల మేరకు  ఎస్ఐలు చంద్రశేఖర్, విజయ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వారి గదిలో ఇంటర్,డిగ్రీ సర్టిఫికెట్లు, కొన్ని పత్రాలు లభించగా వారు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.

మరో మాజీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన వైసీపీ.. పార్టీ నుంచి డీవై దాస్‌ సస్పెన్షన్..

రజక కులానికి చెందిన వీరిద్దరి మధ్య ఇటీవల ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దామోదర్ కుల వృత్తి చేసుకుంటుండగా, సంతోషి కుమారి నర్స్ గా పనిచేస్తున్నట్లు  గుర్తించారు. అమ్మాయి మెడలో తాళి కనబడటంతో వారిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత ఉరి వేసుకుని నట్లుగా పోలీసులు గుర్తించారు. వారి బంధువుల ద్వారా ఇద్దరి తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వారు బుధవారం నగరానికి  రానున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios