ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగడం కలకలం రేపుతోంది. లారీలో గ్యాస్ సిలిండర్ల లోడ్ వుండటంతో పోలీసులు రంగంలోకి దిగి రాకపోకలను నిలిపివేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగడం కలకలం రేపుతోంది. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై జగ్గయ్యపేట మండలం అనువంచిపల్లి వద్ద లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే క్షణాల్లోనే లారీ మొత్తం మంటలు వ్యాపించాయి. లారీలో గ్యాస్ సిలిండర్ల లోడ్ వుండటంతో పోలీసులు రంగంలోకి దిగి రాకపోకలను నిలిపివేశారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
