అమరావతి: ప్రత్యేక హోదా కోసం  రాజీనామా చేసిన ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తూ లోక్‌సభ స్పీకర్  సుమిత్రా మహాజన్  ఆమోదిస్తూ నిర్ణయం తీసుకొన్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ  వైసీపీకి చెందిన  ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేశారు. వైసీపీకి చెందిన మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్ అవినాస్ రెడ్డి,  వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డిలు రాజీనామాలు చేశారు. 

ఈ రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ ను  స్పీకర్  విదేశీ పర్యటనకు వెళ్ళే ముందు కలిశారు. అయితే  మరోసారి రాజీనామాల విషయమై లేఖలు ఇవ్వాలని స్పీకర్ ఎంపీలను కోరారు. ఈ నెల 6వ తేదిన మరోసారి కూడ ఎంపీలు రాజీనామా లేఖలను అందించారు. విదేశీ పర్యటన నుండి వచ్చిన స్పీకర్ సుమిత్రా మహజన్ గురువారం నాడు వైసీపీ ఎంపీల రాజీనామాలపై నిర్ణయం తీసుకొన్నారు.

దీంతో  ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తూ స్పీకర్  సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకొన్నారని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు.

. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రజలకు వివరించనున్నట్టు వైసీపీ ఎంపీలు చెబుతున్నారు. అయితే రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలు బస్సు యాత్ర చేసే ఆలోచనలో కూడ ఉన్నట్టు సమాచారం. 

మరోవైపు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసినా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోవచ్చని  రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయమై టిడిపి నేతలు వైసీపీ పై విమర్శలు గుప్పిస్తోంది. 

ఉప ఎన్నికలు రావనే ఉద్దేశ్యంతో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. అయితే టిడిపి విమర్శలను వైసీపీ కొట్టిపారేస్తోంది. ప్రత్యేక హోదా కోసం తాము చిత్తశుద్దితోనే తమ పదవులకు రాజీనామాలు చేసినట్టుగా వైసీపీ ఎంపీలు చెబుతున్నారు.