Asianet News TeluguAsianet News Telugu

నేతన్నలకు నేను ఉడతా సాయం చేశా..మీరే ఆదుకొండి: జగన్ సర్కార్ ను కోరిన లోకేష్

కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న చేనేత కార్మికులను ఆదుకోవాలని టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వాన్ని కోరారు. 

Lokesh wish to National Handlooms Day
Author
Mangalagiri, First Published Aug 7, 2020, 11:27 AM IST

గుంటూరు: కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న చేనేత కార్మికులను ఆదుకోవాలని టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వాన్ని కోరారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలకు లోకేష్ శుభాకాంక్షలు తెలుపుతూనే కష్టాల్లో వున్న వారికి సాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.

''జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలందరికీ శుభాకాంక్షలు. కరోనా కారణంగా దాదాపు మూడున్నర లక్షల మంది చేనేత కార్మికులు, 81వేల పవర్ లూమ్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అమ్మాల్సిన సరకు చేనేతల వద్దే ఆగిపోయింది'' 

''నేతన్నల దగ్గరున్న స్టాక్ ను వెంటనే కొనుగోలు చేయాలని... ప్రతి కుటుంబానికి 15వేల రూపాయల ప్రత్యేక కరోనా ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాను. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. కేవలం 80 వేలమందికి సాయం అందించి ప్రచారం చేసుకుంటే సరిపోతుందా? మిగిలిన వారి పరిస్థితి ఏంటి?'' అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.

read more   దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగేలా ఏపీలో పరాణామాలు: కళా వెంకట్రావు
 
''లాక్ డౌన్ సమయంలో మంగళగిరి చేనేత కుటుంబాల కష్టాలు స్వయంగా తెలుసుకున్నాను. ఇక్కడి మంగళగిరి చీర ‘భారత చేనేత బ్రాండ్‌'గా ఎంపికైంది. అలాంటి నేతన్న కష్టాలలో ఉడతా సాయంగా బియ్యం, కూరగాయలు పంపిణీ చేయించాను. ప్రభుత్వం ఇకనైనా ముందుకొచ్చి నేతన్నలను ఆదుకోవాలి'' అంటూ ట్విట్టర్ వేదికన జగన్ సర్కార్  ను కోరారు నారా లోకేష్. 

 

Follow Us:
Download App:
  • android
  • ios