Asianet News TeluguAsianet News Telugu

లోకేశ్ కోసం అన్ని జిల్లాల్లో ‘రాజప్ప సభలు’

తూర్పుగోదావరి జిల్లాలో నిన్నజరిగిన లోకేశ్ సమావేశం ఒక విధంగా నవ్వులు పూయించినా, మరొక విధంగా అది సూపర్ హిట్ అయిందని పార్టీ భావిస్తోంది. లోకేశ్ ప్రసంగం బయటివాళ్లకు తమాషాగా కనిపించినా, అభిమానుల్లో దానికి మంచిపేరొచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా  ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప లోకేశ్ బాబును కాబోయే ముఖ్యమంత్రి అని  సభకు పరిచయం చేసిన తీరు అందరికి నచ్చింది. అందుకే మంత్రులంతా చిన్న రాజప్పలు కావాలట...

Lokesh will be paraded across the state as next chief minister of Andhra

లోకేశ్  కాబోయే ముఖ్యమంత్రి-  నిన్న ర్పు గోదావరి జిల్లా సభలో చినరాజప్ప. ఈ ప్రకటన టిడిపి వర్గాల్లో బాగా హిట్ అయింది.       

 

ప్రతి మంత్రీ ఇక  చిన రాజప్ప కావాల్సిందే.

 

దీని కోసం తెలుగుదేశం పార్టీ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారుచేసింది.

 

దీని ప్రకారం,  తొందర్లోనే ఐటి , పంచాయతీ రాజ్ మంత్రి లోకేశ్ నాయుడిని తమ జిల్లాకు ఆహ్వానించి ఒక బ్రహ్మాండమయిన బహిరంగ సభ ఏర్పాటుచేయించాలని జిల్లా మంత్రులకు, ఇన్ చార్జ్ మంత్రులకు  ఆదేశాలు వెళ్లాయి.

 

వేసవిలో రాష్ట్ర మంత మంచినీటి ఎద్దడి తీవ్రమవుతున్నందున లోకేశ్ నాయుడు పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ ప్రాముఖ్యం బాగా పెరిగింది.

 

అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం మంచినీళ్ల సరఫరా  కోసం చేస్తున్న ఏర్పాట్లను జిల్లా పర్యటనలలో లోకేశ్ సమీక్షిస్తారట.  అదే విధంగా రెండేళ్ల లో రాష్ట్రమంతా ప్రతిగ్రామానికి సిమెంట్ రోడ్లు, మంచినీటి వసతి కల్పిస్తానని హామీ ఇస్తారట. దీనికోసం బహిరంగ సభ అవసరం. దీనిని ఏర్పాటు చేసే బాధ్యత జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రికి, జిల్లా ఇన్ చార్జ్ మంత్రికి అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

 

అయితే, దీనిని వెనక వేరే రాజకీయ ఉద్దేశముందని అనుమానావలువ్యక్తమవుతున్నాయి.

 

తూర్పుగోదావరి జిల్లాలో నిన్నజరిగిన లోకేశ్ సమావేశం ఒక విధంగా నవ్వులు పూయించినా, మరొక విధంగా అది సూపర్ హిట్ అయిందని పార్టీ భావిస్తోంది. లోకేశ్ ప్రసంగం బయటివాళ్లకు అవులయగా కనిపించినా,  ఆయన అభిమానుల్లో దానికి మంచిపేరొచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా చిన్న రాజప్ప లోకేశ్ బాబును సభకు పరిచయం చేసిన తీరుకు పార్టీలో బాగా ప్రశంసలొచ్చాయి.

 

 లోకేష్  ని కాబోయే ముఖ్యమంత్రి అని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సభకు వచ్చిన పరిచయం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడయిన లోకేష్ తొలుత పార్టీ సమన్వయకర్తగా, ఆ తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్సీగా, తదుపరి మంత్రిగా వచ్చిన లోకేష్  కాబోయే ముఖ్యమంత్రి గా అంచెంచెలుగా  ఎదుగుతున్నాడని ఉపముఖ్యమంత్రి   ప్రశంసిస్తూ పరిచయడం జరిగింది.

 

ఇదే 13 జిల్లాలలో జరుగబోతున్నదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

 

తెలంగాణాలో ఇపుడు కెటిఆర్  కూడా జనహిత  పేరుతో సోదరి కవిత  కలసి  ఇలాగే ‘కాబోయే ముఖ్యమంత్రి సభలు’ నిర్వహిస్తున్నారు. అక్కడ కెటిఆర్ కు నేతలు నీరాజనాలు పడుతున్నసంగతి అంతాచూస్తున్నదే. అదే రీతిలో  ఆంధ్రలో కూడా జిల్లా జిల్లాలో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ లోకేశ్ ను ప్రత్యేకంగా పరిచయం చేసేందుకుఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే  నిన్న తూర్పుగోదావరి జిల్లా  పర్యటన, కరప లో సభ  ఏర్పాటుచేశారు. ఇది ఒక క్యాబినెట్ మంత్రి రాక సందర్భంగా ఏర్పాటుచేసిన సభలా లాగా కాదు, ముఖ్యమంత్రి అయినందుకు ఏర్పాటుచేసిన పౌర సన్మానం స్థాయిలో జరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios