Asianet News TeluguAsianet News Telugu

ఏపిలో నాలుగు సైబరాబాద్ లు

  • ఆంధ్రప్రదేశ్ లో ‘ఆంధ్రా వ్యాలీ’ ఏర్పాటు చెయ్యనున్నట్లు ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.
Lokesh says Govt is planning to start four cyberabad clusters soon

ఆంధ్రప్రదేశ్ లో ‘ఆంధ్రా వ్యాలీ’ ఏర్పాటు చెయ్యనున్నట్లు ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. కష్టపడి నిర్మించిన సైబరాబాద్ హైదరాబాద్ సొంతమైన కారణంగానే ఏపిలో నాలుగు సైబరాబాద్లు నిర్మించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ తెలిపారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, అనంతపురం లో నాలుగు ఐటి క్లస్టర్లు రాబోతున్నట్లు చెప్పారు.

సైబరాబాద్ పేరు చెప్పగానే మైక్రోసాఫ్ట్ గుర్తువస్తుంది. అలానే ఇప్పుడు తిరుపతి పేరు చెప్పగానే జోహో గుర్తుకొస్తోందన్నారు. విశాఖ కు పెద్ద కంపెనీలు అయిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఏఎన్ఎస్ఆర్, కాన్డ్యూయెంట్, పేటిఎం లాంటి సంస్ధలు వస్తున్నట్లు చెప్పారు. అమరావతి కి హెచ్ సిఎల్ వచ్చిందని అదేవిధంగా అమరావతి డేటా సెంటర్ హబ్ గా మారబోతుందన్నారు.

ఒక్క సైబర్ టవర్ వలన హైదరాబాద్ లో 6 లక్షల ఐటి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న రాజధాని, సైబరాబాద్ పోయిందన్న బాధ తమకుందన్నారు. అంతకు మించిన అభివృద్ధిని సాధించాలన్న కసితో పనిచేస్తున్నట్లు తెలిపారు. తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత 2019 లోపు లక్ష ఐటి ఉద్యోగాలు కల్పించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారట. గత 9 నెలల్లోనే ఐటి రంగంలో 24 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఒక్క మంగళగిరి ఐటిక్లస్టర్ లోనే 10 వేల ఉద్యోగాలు రాబోతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకూ మంగళగిరి క్లస్టర్ లో 25 కంపెనీల్లో  2 వేల ఉద్యోగాలు వచ్చాయన్నారు.

అనంతపురంలో బెంగుళూరు ప్లస్ ప్లస్ ప్రాజెక్ట్ పేరుతో త్వరలోనే ఓ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఒక్కో క్లస్టర్ లో 2.5 లక్షల ఉద్యోగాలు, పది ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మన రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం పెద్దగా అభివృద్ధి చెందలేదన్నారు. మన రాష్ట్రంలో అప్పుడు ఒక్క ఫోన్ కూడా తయారు కాలేదు. కానీ ఇప్పుడు దేశంలో తయారు అవుతున్న టాప్ 10 ఫోన్లలో 2 మన రాష్ట్రంలోనే తయారవుతున్నట్లు చెప్పారు.

ఐటి కంపెనీలను ఆకర్షించడానికి డిటిపి పాలసీ తీసుకొచ్చాం. ఫార్చ్యూన్ 500 కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడానికి ఐఐటి పాలసీ తీసుకొచ్చాం. ఐటి రంగం పూర్తి స్థాయి లో అభివృద్ధి చెందాలి అంటే కేవలం పెద్ద కంపెనీలు మాత్రమే కాదు చిన్న ,మధ్య తరగతి కంపెనీలు కూడా రావాలని లోకేష్ అభిప్రాయపడ్డారు.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios