Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ కు బంపర్ ఆఫర్

ట్రంప్ నే గెలిపించిన తనకు ఎంఎల్ఏగా లోకేష్ ను గెలిపించటం ఓ లెక్కే కాదని తేల్చేసారు. ఎప్పుడైతే పాల్ లోకేష్ కు మద్దతు ప్రకటించారో టిడిపి వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయట.

Lokesh receives bumper offer from KA Paul

నారా చంద్రబాబునాయుడు ఇక నిశ్చింతగా ఉందవచ్చు. ఎందుకంటే, రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ కు పెద్ద రాజకీయ అండ దొరికింది. క్రైస్తవ మత ప్రబోధకుడు కెఏ పాల్ లోకేష్కు  తన మద్దతు ప్రకటించారు. ఎంఎల్ఏ గా లోకేష్ పోటీ చేస్తే తానే దగ్గరుండి మరీ ప్రచారం చేసి గెలిపిస్తానంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చేసారు. ఇంకేముంది ఇక తేల్చుకోవాల్సిందే తండ్రీ కొడుకులే. ఎంఎల్ఏ కోటాలో లోకేష్ ను ఎంఎల్సీగా పంపటానికి చంద్రబాబునాయుడు రంగం సిద్ధం చేసారు.  ఎంఎల్సీగా తనను పంపాలని నిర్ణయించిన పాలిట్ బ్యూరోకు లోకేష్ కూడా ధన్యవాదాలు తెలిపేసారు.

 

ఈ సమయంలోనే ఎంఎల్సీగా లేకష్ ఎంపికపై సోషల్ మీడియా, వైసీపీ నుండి వ్యంగ్యాస్ర్త్రాలు మొదలయ్యాయి. లోకేష్ కు అంత సామర్ధ్యమే ఉంటే నేరుగా ఎంఎల్ఏగానే ఎన్నికవచ్చుకదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎంఎల్ఏగా గెలిచేంత సీన్ లేదు కాబట్టే ఎంఎల్సీగా అదీ ఎంఎల్ఏల కోటాలో పోటీ చేస్తున్నట్లు అన్నీ వైపుల నుండి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే కెఏ పాల్ లోకేష్ కు మద్దతుగా నిలిచారు. ఆయనకూడా ‘ఎంఎల్సీగా ఎందుకు నేరుగా ఎంఎల్ఏగానే పోటీ చేయా’లని సూచించారు. లోకేష్ గనుక ఎంఎల్ఏగా పోటీ చేస్తే తానే దగ్గరుండి గెలిపిస్తానని హమీ కూడా ఇచ్చేసారు.

 

పైగా అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా ప్రచారం చేసి గెలిపించానని కూడా చెప్పారు. ట్రంప్ నే గెలిపించిన తనకు ఎంఎల్ఏగా లోకేష్ ను గెలిపించటం ఓ లెక్కే కాదని తేల్చేసారు. ఎప్పుడైతే పాల్ లోకేష్ కు మద్దతు ప్రకటించారో టిడిపి వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయట. అక్కడ ట్రంప్ ను గెలిపించిన కెఏ పాలే ఇక్కడ లోకేష్ ను గెలిపిస్తానని చెబుతున్నారు. రేపటి రోజున ట్రంప్ తో తనకు ఏదైనా అవసరమైతే కెఏ పాల్ సహాయం తీసుకోవచ్చేమో చంద్రబాబు కాస్త ఆలోచించవచ్చు.