జగన్ నాయకత్వంలో పనిచేయలేక టిడిపిలోకి వచ్చేస్తామని వైసీపీ ఎంఎల్ఏలు మొత్తుకుంటుంటే తాము ఏం చేయాలంటూ అతితెలివిగా ఎదురు ప్రశ్నించారు. అదే సూత్రం తెలంగాణాలో టిడిపి ఎంఎల్ఏలకూ కూడా వర్తిస్తుందన్న విషయాన్ని లోకేష్ మరచిపోయినట్లున్నారు. పైగా ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రి పదవులు ఇవ్వకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అంటూ చాలా అమయాకంగా ప్రశ్నించారు. వైసీపీ నుండి గెలిచిన ఎంఎల్ఏలను రాజీనామాలు చేయించకుండానే టిడిపిలోకి తీసుకోవటమన్నది నైతికతకు సంబంధించిన అంశం.
ఫిరాయింపు రాజకీయాలను టిడిపి నిశిగ్గుగా సమర్ధించుకుంటోంది. ఫిరాయింపులను ప్రోత్సహించటం అసలు తప్పేకాదన్నట్లు నారా లోకేష్ మాట్లాడుతున్నారు. మంత్రిగా 100 రోజులు పూర్తయిన సందర్భంగా బుధవారం రాత్రి ఓ ఛానల్ కు నారా లోకేష్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, జగన్ నాయకత్వంలో పనిచేయలేక టిడిపిలోకి వచ్చేస్తామని వైసీపీ ఎంఎల్ఏలు మొత్తుకుంటుంటే తాము ఏం చేయాలంటూ అతితెలివిగా ఎదురు ప్రశ్నించారు. అదే సూత్రం తెలంగాణాలో టిడిపి ఎంఎల్ఏలకూ కూడా వర్తిస్తుందన్న విషయాన్ని లోకేష్ మరచిపోయినట్లున్నారు.
పైగా ఫిరాయింపు ఎంఎల్ఏలకు మంత్రి పదవులు ఇవ్వకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అంటూ చాలా అమయాకంగా ప్రశ్నించారు. నిజమే, ఫిరాయింపు ఎంఎలఏలకు మంత్రి పదవులు ఇవ్వకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేనిమాట వాస్తవమే. కాకపోతే వైసీపీ నుండి గెలిచిన ఎంఎల్ఏలను రాజీనామాలు చేయించకుండానే టిడిపిలోకి తీసుకోవటమన్నది నైతికతకు సంబంధించిన అంశం.
ఫిరాయింపుల చేత రాజీనామాలు చేయించాలన్న వైసీపీ డిమాండ్ గురించి మాత్రం లోకేష్ మాట్లాడలేదు. ఇక్కడ సమస్య ఫిరాయింపుల చేత ఎంఎల్ఏలకు రాజీనామాలు చేయించలేదనే. ఇదే అంశం మీదే కదా తెలంగాణాలో టిడిపి ఎంఎల్ఏలను టిఆర్ఎస్ లాక్కున్నపుడు, తలసానికి మంత్రిపదవి ఇచ్చినపుడు చంద్రబాబునాయుడు అమ్మనాబూతులు మాట్లాడిన విషయాన్ని ఎవరైనా ఎలా మరచిపోతారు?
సరే, ఇక మిగిలిన ప్రశ్నలకు కూడా అదే విధంగా సమాధానాం చెప్పారులేండి. ప్రశ్నకు ప్రశ్నే సమాధానం అన్నట్లుగా సాగింది లోకేష్ వ్యవహారం. ఇంటర్య్వూలో తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోకుండా ప్రతీ ప్రశ్నకూ ఎదురు ప్రశ్న వేసారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవాల్సింది పోయి ప్రతీ ఆరోపణలోనూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావించటం విచిత్రం. తనపై వినిపిస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక జగన్ను అడ్డుపెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లే కనిపించింది.
2019లో భాజపా, పవన్ తో పొత్తుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, 2014 లో పోటీ చేసినట్లే చేస్తామన్నారు. శాసనసభకు ఎన్నికవ్వకుండా శాసనమండలి ద్వారా మంత్రిమండలిలోకి ప్రవేశించిన విషయాన్ని ప్రస్తావించారు. లోకేష్ మాట్లాడుతూ, శాసనమండలేమన్నా తక్కువనుకుంటున్నారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. 2019లో ప్రత్యక్ష్య రాజకీయాల ద్వారా అసెంబ్లీకి ఎన్నికవ్వాలని తనకు కూడా ఉందన్నారు. తన కోసం ఎవరో ఎంఎల్ఏని బలిచేయటం ఇష్టం లేకే కౌన్సిల్ ద్వారా మంత్రివర్గంలోకి ప్రవేశించానన్నారు. ఒకపుడు రాజ్యసభ ద్వారా ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ ను, కౌన్సిల్ ద్వారా సిఎం అయిన రోశయ్య ను చంద్రబాబు, టిడిపి వాళ్ళు విమర్శించిన సంగతి బహుశా లోకేష్ మరచిపోయినట్లున్నారు.
రూ. 46 లక్షల నుండి రూ. 320 కోట్లకు ఆస్తులు పెరగటాన్ని ప్రశ్నించగా, హెరిటేజ్ వాల్యూ పెరిగింది కాబట్టే తన వాటా 10 శాతం షేర్ల ధరలు పెరగటంతో ఆస్తుల విలువ కూడా పెరిగిందన్నారు. జగన్ లాగ ఇతరుల నుండి పెట్టుబడుల పేరుతో డబ్బులు తీసుకుని ఆస్తులు పెంచుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో అవసరమైతే పోరాడుతామన్నారు. విశాఖ భూకుంభకోణంపై ప్రశ్నించగా తనకు ఏమీ సంబంధం లేదన్నారు. నిజంగా కుంభకోణం జరిగివుంటే సిట్ కు ఆధారాలివ్వచ్చు కదా అంటూ ప్రశ్నించారు. ఇలా..ఏ ప్రశ్న వేసినా డొంకతిరుగుడు సమాధానాలు చెబుతూ, ఎదురు ప్రశ్నలు వేస్తూ, జగన్ అడ్డం పెట్టుకుంటూ మొత్తానికి ఇంటర్వ్యూ అయిందనిపించుకున్నారు.
