ప్రతీ విషయంలోనూ కెటిఆర్ తో నారా లోకేష్ పోటీ పడుతున్నారు. పార్టీ అయినా ప్రభుత్వమై అదే పోటి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారంతో మొదలైన పోటీ ఇప్పటికీ కొనసాగుతోంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో అటు కెటిఆర్ అంతా తానై టిఆర్ఎస్ అభ్యర్ధుల విజయాన్ని భుజానేసుకుని ప్రచారం చేసారు. ఇటు లోకేష్ కుడా టిడిపి అభ్యర్ధుల కోసం తీవ్రంగా శ్రమించారు.

‘‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు’’ గా ఉంది లోకేష్ వ్యవహారం. ప్రతీ విషయంలోనూ కెటిఆర్ తో నారా లోకేష్ పోటీ పడుతున్నారు. పార్టీ అయినా ప్రభుత్వమై అదే పోటి. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారంతో మొదలైన పోటీ ఇప్పటికీ కొనసాగుతోంది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో అటు కెటిఆర్ అంతా తానై టిఆర్ఎస్ అభ్యర్ధుల విజయాన్ని భుజానేసుకుని ప్రచారం చేసారు. ఇటు లోకేష్ కుడా టిడిపి అభ్యర్ధుల కోసం తీవ్రంగా శ్రమించారు. సరే, ఫలితం అందరూ చూసిందే.

తర్వాత కెటిఆర్ ఐటి మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. తర్వాత నారా లోకేష్ కుడా ఐటి, పంచాయితీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కెటిఆర్ వ్యవహారం చూసిన తర్వాతే లోకేష్ ఐటి, పంచాయితీ రాజ్ శాఖలు తీసుకున్నారు. అదే సమయంలో కెటిఆర్ ఐటి సంస్ధలను తెలంగాణాకు తీసుకురావటానికి అమెరికా పర్యటించారు. లోకేష్ కుడా అమెరికాకు వెళ్ళి వచ్చారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల కోసం తరచూ ఢిల్లీకెళుతున్నారు. లోకేష్ కుడా ఢిల్లీ పర్యటనలు పెట్టుకుంటున్నారు.

పెట్టుబడుల కోసం, విదేశీ అతిధులతో కెటిఆర్ సమావేశమవుతూ ప్రజంటేషన్లు ఇస్తున్నారు. లోకేష్ కుడా అదే పనిచేస్తున్నారు. తాజాగా ఇద్దరూ తమ రాష్ట్రాల గురించి ప్రజంటేషన్లు ఇవ్వటానికి ఢిల్లీలో ప్రసంగించారు. ఇక్కడే లోకేష్ పాండిత్యం బయటపడిపోయింది. దాంతో ‘పులిని చూసి నక్క వాతలుపెట్టుకున్నట్లుం’దని అందరూ అనుకుంటున్నారు.